faces
-
ఢిల్లీలో విద్యుత్ సంక్షోభం.. పలు ప్రాంతాల్లో అంధకారం
దేశరాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలను దాటి బెంబేలెత్తిస్తున్నాయి. దీనికితోడు ఒక వైపు నీటి ఎద్దడి, మరోవైపు కొత్తగా తలెత్తిన విద్యుత్ సంక్షోభం ఢిల్లీవాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.ఢిల్లీలోని మండోలా, లోని ప్రాంతాల్లోని పవర్ గ్రిడ్ స్టేషన్లలో అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా మంటలు చెలరేగాయి. ఫలితంగా ఉత్తర ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం 2:11 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.ఢిల్లీలోని వజీరాబాద్, కాశ్మీరీ గేట్, గీతా కాలనీ, హర్ష్ విహార్, ప్రీత్ విహార్, ఐపీ పవర్, రాజ్‌ఘాట్, నరేలా, గోపాల్పూర్ ప్రాంతాల్లోని సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయి. విద్యుత్ అంతరాయాల కారణంగా పలు నీటి శుద్ధి ప్లాంట్లు పనిచేయడం లేదు. ఇది తాగునీటి సమస్యకు తీవ్రతరం చేసింది. ఈ నేపధ్యంలో సమస్య పరిష్కారం కోసం కేంద్ర ఇంధన శాఖ మంత్రితో ఢిల్లీ మంత్రి అతిషి భేటీ కానున్నారు. ఈ విషయాన్ని అతిషీ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఖాతాలో తెలిపారు.నీటి ఎద్దడి సమస్యను కూడా అతిషీ దానిలో ప్రస్తావించారు. గత కొన్ని వారాలుగా ఢిల్లీలో తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయని, దీని కారణంగా నీటి వినియోగం పెరిగిందని, హర్యానా నుంచి రావాల్సిన నీరు అంతకంతకూ తగ్గుతోందని, హర్యానాలోని వజీరాబాద్ బ్యారేజీ, మునక్ కెనాల్ నుంచి నీరు రావడం లేదని ఆమె పేర్కొన్నారు. దీనికితోడు ఢిల్లీలోని డబ్ల్యూటీపీలు పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదని కూడా తెలిపారు. -
2019లో భారీ విజయాన్నందుకున్న ఎంపీలు వీరే!
2024 లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నాహాలు ముమ్మరం చేశాయి. ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను కూడా ప్రకటించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఓట్లతో గెలిచిన టాప్- 5 అభ్యర్థులంతా బీజేపీకి చెందినవారే కావడం విశేషం. వారెవరో ఎక్కడెక్కడి నుంచి పోటీ చేశారో తెలుసుకుందాం. 1. నవ్సారి (గుజరాత్). సీఆర్ పాటిల్ ఈ స్థానం నుండి 2019లో బీజేపీ చెందిన సీఆర్ పాటిల్ 6 లక్షల 89 వేల 668 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌కు చెందిన ధర్మేష్ పటేల్‌పై విజయం సాధించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ.. సీఆర్‌పాటిల్‌ను తన అభ్యర్థిగా నిలబెట్టింది. సీఆర్ పాటిల్ గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు. గత మూడు లోక్‌సభ ఎన్నికల్లో ఆయన విజయ పతాకం ఎగరేశారు. 2. కర్నాల్ (హర్యానా)- సంజయ్ భాటియా హర్యానాలోని ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సంజయ్ భాటియా 6 లక్షల 56 వేల 142 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ శర్మపై విజయం సాధించారు. సంజయ్ భాటియాకు 70 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. అయితే రాబోయే ఎన్నికల్లో బీజేపీ సంజయ్ భాటియాకు టిక్కెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను అభ్యర్థిగా నిలబెట్టింది. 3. ఫరీదాబాద్ (హర్యానా)- కృష్ణపాల్ గుర్జార్ హర్యానాలోని ఫరీదాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి కృష్ణపాల్ గుర్జార్ కాంగ్రెస్ అభ్యర్థి అవతార్ భదానాపై 6 లక్షల 38 వేల 239 ఓట్లతో విజయం సాధించారు. ఈసారి కూడా బీజేపీ కృష్ణపాల్ గుర్జార్‌ను రంగంలోకి దించింది. 4. భిల్వారా (రాజస్థాన్) - సుభాష్ చంద్ర బీజేపీ అభ్యర్థి సుభాష్ చంద్ర కాంగ్రెస్ అభ్యర్థి రామ్ పాల్ శర్మపై 6 లక్షల 12 వేల ఓట్లతో విజయం సాధించారు. 2024 ఎన్నికలకు సంబంధించి అభ్యర్థి పేరు ఇంకా ఖరారు కాలేదు. ఈ టికెట్ కోసం పలువురు బీజేపీ నేతలు పోటీ పడుతున్నారు. 5. వడోదర (గుజరాత్)- రంజన్‌బెన్ భట్ గుజరాత్‌లోని వడోదర నుంచి బీజేపీ అభ్యర్థి రంజన్‌బెన్ భట్ 5.89 లక్షల ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి ప్రశాంత్ పటేల్‌పై విజయం సాధించారు. బీజేపీ మరోసారి రంజన్‌బెన్ భట్‌ను రంగంలోకి దించింది. గత రెండు లోభసభ ఎన్నికల్లోనూ ఆయన విజయం దక్కించుకున్నారు. 2014లో ప్రధాని నరేంద్రమోదీ ఇక్కడి నుంచి వైదొలగినప్పటి నుంచి రంజన్‌బెన్ భట్ ఈ స్థానం నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. -
దేశంలో హిందీపై వ్యతిరేకత ఎందుకు?
నేడు (సెప్టెంబరు 14) హిందీ దినోత్సవం. దీనిని హిందీ పక్షోత్సవంగానూ నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా పలుచోట్ల హిందీ భాషకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హిందీకి తగిన గౌరవం అందించేందుకే హిందీ దినోత్సవం నిర్వహిస్తున్నారు. అయితే దేశంలో అత్యంత విస్తృతమైన మనుగడ కలిగిన ఈ భాషకు దేశ జాతీయ భాష హోదాను ఇవ్వడానికి చేసిన ప్రయత్నాలు విమర్శల పాలవుతున్నాయి. హిందీని దేశ జాతీయ భాషగా చేయాలనే ఆలోచన వచ్చినప్పుడల్లా పలు చోట్ల ప్రజలు నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీని వెనుకనున్న కారణమేమిటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో హిందీ చాలా విస్తృతంగా మాట్లాడే భాష. ఇది అనేక విభిన్న మాండలికాలు, రూపాలను కలిగి ఉంది. ప్రాథమికంగా హిందీ ఇండో-యూరోపియన్ భాషా కుటుంబంలోని ఇండో-ఇరానియన్ శాఖకు చెందిన ఇండో-ఆర్యన్ సమూహం మాట్లాడే భాషగా పరిగణిస్తారు. ఇది భారతదేశంలోని అనేక ప్రాంతాలలో అధికారిక భాషగానూ కొనసాగుతోంది. స్వాతంత్ర్య పోరాట కాలం నుంచి హిందీకి తగిన గౌరవం కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే హిందీపై వ్యతిరేకత ఏర్పడటానికి దాని చరిత్ర, నేపథ్యం కూడా కారణంగా నిలుస్తోంది. హిందీ భాష దేశంలోని ఇతర రాష్ట్రాలకు చేరుకోగలిగినంత సులభంగా తమిళనాడు, కేరళకు చేరుకోలేకపోయింది. బ్రిటీష్ వారు సముద్ర మార్గం ద్వారా దక్షిణ భారతదేశంలోని ఈ రాష్ట్రాలకు చేరుకున్నారు. అక్కడి నుంచే ఉత్తర భారతదేశంలోకి తమ చొరబాట్లను విస్త్రృతం చేశారు. ఫలితంగా ఆ రెండు రాష్ట్రల్లో ఇంగ్లీష్ భాషా వినియోగం అధికంగా ఉండేది. దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజల మాదిరిగా ఈ రాష్ట్రాల ప్రజలు హిందీలో మాట్లాడటం సులభతరంగాలేదని భావించారు. దీంతో ఈ రాష్ట్రాల్లో హిందీని విదేశీ భాషగా వర్ణించే పరిస్థితి ఏర్పడింది. తమిళనాడు, కేరళ ప్రజలు తమపై హిందీని రుద్దుతున్నారని ఆరోపించడానికి ఇదే కారణంగా నిలిచింది. 1937లో స్వాతంత్ర్య సమరయోధుడు సి రాజ్‌గోపాలాచారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమిళనాడులోని పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఈ నేపధ్యంలో తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం మొదలయ్యింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో రాజ్యాంగ సభలో హిందీని అధికార భాషగా చేయడంపై చర్చ జరిగింది. ఈ నేపధ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడులో మరోసారి నిరసనలు చోటుచేసుకున్నాయి. దేశంలో హిందీకి ఎదురవుతున్న వ్యతిరేకతను పరిణలోకి తీసుకుని, 1950లో కేంద్ర ప్రభుత్వం రాబోయే 15 సంవత్సరాల పాటు ఆంగ్లంతో పాటు ఇతర భాషలు దేశంలో అధికారిక భాషలుగా ఉండాలనే నిర్ణయం తీసుకుంది. అయితే 1965లో హిందీపై వ్యతిరేకత మరోసారి మొదలైంది. దీంతో 1950లో తీసుకున్న నిర్ణయాన్నే కొనసాగించాలని ప్రభుత్వం తీర్మానించింది. కాగా భాషకు సంబంధించి కేంద్రం నుంచి ఎప్పుడైనా ఏదైనా చట్టం, ప్రతిపాదన వచ్చినప్పుడల్లా హిందీపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది కూడా చదవండి: ఆ భారత యువరాణి బ్రిటన్‌లో మహిళల కోసం ఎందుకు పోరాడారు? -
జీవితాంతం ఒంటరిగానే ఉంటా కానీ! హోలీ యాడ్‌పై దుమారం: అసలేమైంది?
సాక్షి,ముంబై: మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ భారత్ మ్యాట్రిమోనీ వివాదంలో ఇరుక్కొంది. హోలీ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కంపెనీ విడుదల చేసిన యాడ్‌పై సోషల్ మీడియాలో దుమారం చెలరేగింది. పవిత్ర హోలీని అవమానకరంగా చిత్రీకరించి హిందూ మనోభావాలను దెబ్బతీశారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాయ్‌కాట్ భారత్ మోట్రిమోనీ అన్న డిమాండ్ ఊపందుకుంది. ఈ యాడ్‌పై చర్చ కారణంగా ఇది ఇప్పటికే 1.5 మిలియన్ల వ్యూస్‌ను సాధించింది. రంగుల పండుగ సందర్భంగా మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులపై భారత్ మ్యాట్రిమోనీ ఒక వీడియోను పోస్ట్ చేసింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం,హోలీ సందర్బంగా మహిళలకు సురక్షిత వాతావరణాన్ని సృష్టించాలంటూ తన యాడ్‌లో కోరింది. కొన్ని కలర్స్( మరకలు) అంత తొందరగా మాసిపోవు. వేధింపుల వల్ల ప్రతీ ముగ్గురిలో ఒకమహిళ హోలీకి దూరంగా ఉంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొనే సవాళ్లను గుర్తించడం వారి శ్రేయస్సును గౌరవించే సమాజాన్ని సృష్టించడం ముఖ్యం అని పేర్కొంది. అంతే ఒక్కసారిగా అగ్గి రాజుకుంది. ‘‘మీకు హిందూ వినియోగదారులంటే లెక్కలేదా..సిగ్గుపడండి..బ్యాన్ భారత్ మోట్రిమోనీ’’ అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ట్విటర్లో #BoycottBharatMatrimony ట్రెండింగ్‌లో నిలిచింది. హోలీని తిట్టడమే లక్ష్యం. హిందూ పండుగలను హిందూ వ్యతిరేక ప్రచారానికి ఉపయోగించుకోకండి అని ఒకరు ట్వీట్ చేయగా, భారత్ మ్యాట్రిమోనీ యాడ్ హిందూ సంప్రదాయాలను అగౌరవపరిచేదిగాను, హిందూ మత మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ మరికొందరు ఆగ్రహించారు. హిందువుల పండుగలప్పుడు మాత్రమే మహిళల రక్షణ, కాలుష్యం, జంతువుల హక్కులు గుర్తొస్తాయా అంటూ ఇంకొకరు మండిపడ్డారు. ఈ యాడ్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేయడంతోపాటు భారత్ మ్యాట్రిమోనీని నిషేధించాల్సిందేనని కమెంట్ చేస్తున్నారు. ఈ యాడ్‌లో తప్పేమీ లేదంటూ సంస్థ భావ ప్రకటనా స్వేచ్ఛను సమర్థించిన వారు లేకపోలేదు. అలాగే సంస్కృతి పేరుతో ప్రతిదీ మంచిది కాదు. సతి, వరకట్నం కూడా భారతీయ సంస్కృతిలో భాగమే. చెడును వ్యతిరేకించాలి. హోలీ రోజున మహిళలపై వేధింపులు నిజమే. దీని వల్ల మొత్తం పండుగకే చెడ్డ పేరు వస్తుందని మరికొంతమంది యూజర్లు వ్యాఖ్యానించారు. అయితే ఈ విమర్శల నేపథ్యంలో క్యాప్షన్‌ను సవరించి, సోషల్ మీడియా పేజీలలో తాజా పోస్ట్‌లను అప్లోడ్ చేసింది. అయినా విమర్శల సెగ చల్లార లేదు. కాగా ప్రకటనలపై విమర్శలు, వివాదం చెలరేగడం ఇదే మొదటి సారి కాదు. గతంలో ఫ్యాబ్ఇండియా, తనిష్క్, సియట్ టైర్లు, అమోజాన్ లాంటి పలు సంస్థలు దాదాపు ఇలాంటి వివాదాల్లో పడ్డాయి. ఇటీవల ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ హోలీ ప్రకటనలపై విమర్శలు వెల్లువెత్తాయి. హోలీ సందర్భంగా ప్రజలు ఒకరిపై ఒకరు గుడ్లు విసురుకోవద్దంటూ ఢిల్లీలోని స్విగ్గీ బిల్బోర్డ్ వివాదానికి దారితీయడంతో తరువాత, దాన్ని స్విగ్గీ తొలగించింది. I will be single in my entire life but i will never register in this #BHARATMATRIMONY@bharatmatrimony is fully hypocrisy all this gyans are vanished in Christian and Muslim festivals Total Boycott 🚫 #BoycottBharatMatrimony — ÂkaSH আকাশ (@itzmeakashmazz) March 8, 2023 pic.twitter.com/pMTJCNRBwV — Ankit Bhuptani 🏳️🌈 (@CitizenAnkit) March 8, 2023 -
మెడికల్ మిరాకిల్..18వ పడిలోకి ‘రెండు ముఖాల’ బాలుడు!
వాషింగ్టన్: ఈ బాలుడిని ప్రపంచ వింతగానే చెప్పుకోవాలి. సాధారణంగా జన్యులోపంతో జన్మించిన పిల్లలు ఎక్కువ కాలం బతకరని వైద్యులు చెబుతుంటారు. రెండు ముఖాలతో జన్మించిన ఈ బాలుడు సైతం ఎంతో కాలం జీవించలేడని వైద్యులు చెప్పేశారు. కానీ, ఈ బాలుడు తనకు ఎదురైవుతున్న సమస్యలన్నింటినీ దాటుకుని ఇప్పుడు 18వ పడిలోకి అడుగుపెట్టాడు. వైద్యుల మాట తప్పు అని నిరూపిస్తూ మెడికల్ మిరాకిల్ అనిపించుకుంటున్నాడు. ఆ బాలుడే అమెరికాకు చెందిన ట్రెస్ జాన్సన్. అమెరికాలోని మిస్సోరీకి చెందిన ట్రెస్ జాన్సన్.. రెండు ముఖాలతో జన్మించాడు. ఎస్హెచ్ఎచ్ అనే జన్యు లోపం కారణంగా ఇలా జరిగినట్లు వైద్యులు తెలిపారు. ముఖంపై రెండు ముక్కులు, మూడు కళ్లు, నోటిలోనూ చిలిక.. దాదాపుగా రెండు ముఖాలు ఉన్నాయి. తొలుత చాలా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. అయితే.. అధునాత చికిత్సలతో బాలుడు వేగంగా కోలుకున్నాడు. గంజాయి ఆయిల్ తీసుకోవటం ద్వారా ముక్కు కారే సమస్య దాదాపుగా నియంత్రణలోకి వచ్చిందని జాన్సన్ తల్లితండ్రులు తెలిపారు. అదే ఆయిల్‌ను గత ఏడేళ్లుగా ఉపయోగిస్తున్నామని చెప్పారు. వింత జబ్బులతో బాధపడుతున్న తన కుమారుడికి ఔషధాల కోసం చాలా ఇబ్బందులు పడ్డామని, ప్రసవం తర్వాత తొలిసారి తన బిడ్డను చూసుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు జాన్సన్ తల్లి బ్రాండీ. ప్రస్తుతం తన కుమారుడు 18 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టినట్లు చెప్పారు. జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు వెల్లడించారు. View this post on Instagram A post shared by TresMa (@diprosopusdiaries) ఇదీ చదవండి: విమాన సిబ్బందికి ‘లోదుస్తులు’ కంపల్సరీ.. పాక్ ఎయిర్‌లైన్స్ నవ్వులపాలు, ఆగ్రహజ్వాలలు -
ఉద్దండులున్నా... తిండిగింజల్లేవు!
శ్రీలంక ప్రజలు ఇప్పుడు ఆకలితో అలమటిస్తున్నారు. ధరలు పెరగటం అటుంచి, కొనేందుకు కూడా నిత్యావసర వస్తువులు కనిపించడం లేదు. చివరకు ఆహార అత్యయిక పరిస్థితి విధించాల్సి వచ్చింది. ఇప్పుడు శ్రీలంకకు కావలసింది హిట్లర్ కాదు... మండేలా! శ్రీలంకలోని ప్రజాస్వామిక వ్యవస్థలు స్వేచ్ఛగా, దృఢంగా, స్వతంత్రంగా పనిచేసేందుకు వీలైన అనుకూలతలు ఏర్పడాలి. ప్రస్తుతం ఉపయుక్తమైన ఆలోచన ఏమిటంటే – ఎస్.ఎల్.పి.పి. లేదా ఆ పార్టీ నాయకుడు రాజపక్సే తన పాలనా యంత్రాంగపు విధానపరమైన భారీ తప్పిదాలను, రాజకీయ వైఫల్యాలను అధ్యయనం చేయడానికి తక్షణం ఉద్యుక్తులవడం! ఎన్నికలకు ముందు శ్రీలంక తన ప్రజలకు గొప్ప శ్రేయస్సును, వైభవాన్ని దృగ్గోచరం చేసింది. ఆ వాగ్దానానికి 60 లక్షల 90 వేల మంది ప్రజలు ఓటు వేశారు. అయితే ప్రభుత్వం ఏర్పరిచి న రెండేళ్లలోనే ప్రతి ఒక్కరికీ వాస్తవం ఏమిటో అనుభవంలోకి వచ్చింది. ఆర్థికంగా బరువు. ఆహారం కరువు. వంట గ్యాసు మొదలు పాలపొడి వరకు, విదేశీ మారకద్రవ్యం నుంచి ముడి చమురు వరకు అన్నింటికీ కొరతే! ఇప్పుడిక విద్యుత్ కోతలు కూడా మొదలయ్యాయి. ఆలస్యమైన స్థానిక, ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ధైర్యం కూడగట్టు కోలేకపోతోంది. ఎన్నికల్లో ఇచ్చేందుకు వాగ్దానాలు ఉన్నట్లే, ఎన్నికలు నిర్వహించలేకపోవడానికి ఇప్పుడు చూపించేందుకు కారణాలూ ఉండొచ్చు. అయితే కోవిడ్‌ను కారణంగా చూపడానికి శ్రీలంక ప్రభు త్వానికి ముఖం చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేదు. తొలి వేవ్ కోవిడ్ తీవ్రంగా ప్రబలుతున్న సమయంలోనే దీర్ఘకాల లాక్డౌన్ అనంతరం 2020 ఆగస్టులో శ్రీలంక పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. వైరస్‌లతో సహజీవనం అలవాటైంది. ఆహార కొరత, అర్ధాకలి కూడా శ్రీలంకలో ఇప్పుడు సర్వసాధారణమైన విషయాలు. వాస్తవానికి శ్రీలంక పరిస్థితి ప్రపంచదేశాల ఊహకే అందనంత దయనీయంగా ఉంది. విదేశీ మారక ద్రవ్య నిల్వల్ని పొదుపుగా వాడు కోవడం కోసం పప్పులు, ఉప్పుల దిగుమతుల్ని కూడా ప్రభుత్వం నియంత్రించుకోవడంతో శ్రీలంక ప్రజలు ఆకలితో అలమటించవలసి వస్తోంది. చివరికి ఆహార అత్యయిక స్థితి విధించాల్సి వచ్చింది. ఈ తాజా దుఃస్థితికి మూడేళ్ల క్రితం నాటి ఉగ్రదాడులు నాంది పలికా యనీ, దాడుల కారణంగా శ్రీలంక పర్యాటకరంగం తన ప్రాభవాన్ని కోల్పోయి దేశ ఆర్థిక స్థితి క్షీణించిందనీ, ఆ తర్వాత కరోనా వచ్చి దేశాన్ని క్రుంగదీసిందనీ ఎన్ని కారణాలు చెప్పుకున్నా... పాలకుల రాజకీయ ప్రయోజనాలు దివాళా వైపు నడిపించాయన్నది వాస్తవం. ఇప్పుడిక ఉపయుక్తమైన ఆలోచన ఏమిటంటే ఎస్.ఎల్.పి.పి. లేదా ఆ పార్టీ నాయకుడు రాజపక్సే తన పాలనా యంత్రాంగపు విధానపరమైన భారీ తప్పిదాలను, రాజకీయ వైఫల్యాలను అధ్య యనం చేయడానికి తక్షణం ఉద్యుక్తులవడం! అందువల్ల ప్రభుత్వం తన తప్పుల నుంచి తను నేర్చుకుంటుంది. అధికసంఖ్యాక జాతుల మత జాతీయవాదులను కలుపుకొని పని చేయడానికి పరిమితులు ఉండనే ఉంటాయి. ‘అపకీర్తిపరుల అంతిమ ఆశ్రయం దేశభక్తి’ అని సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత శామ్యూల్ జాన్సన్ 1745లో అన్న మాటకు ఇక్కడ చక్కగా అన్వయం కుదురుతుంది. శామ్యూల్‌కు కానీ, ఇతర రాజకీయ సిద్ధాంతకర్తలకు కానీ నాడైనా, నేడైనా ఉన్న గమనింపు ఒకటే. పాలనలోని స్వప్రయోజన ప్రయత్నాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల దృష్టి నుంచి మళ్లించడానికి నాయకులు తమ మత, జాతీయ వాదాన్ని రాజకీయ గుర్తింపుగా సంధిస్తారని! దురదృష్టవశాత్తూ శ్రీలంక కూడా ఇదే విధమైన స్వార్థ రాజకీయ వ్యూహాలకు గురవుతూ వస్తోంది. అంతర్యుద్ధానంతర కాలంలో 2010 నుంచి 2014 వరకు, 2019 నుంచి నేటి వరకు రాజకీయ అధికారం కోసం నాయకులు శ్రీలంక సమాజంలో విభజనల్ని అధికం చేశారు. శ్రీలంకలోని పాలనాపరమైన విధానాలు ఎప్పుడు చర్చకు వచ్చినా బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ‘విభజించు–పాలించు’ విధానమే వాటికి పూర్వరంగంగా వక్తల అభిప్రాయాలు వెల్లడవుతాయి. ప్రపంచంలోని అన్ని వలస ప్రాంతాలను పాలించినట్లే బ్రిటిష్ ఆనాటి సిలోన్‌ను కూడా తన విభజన రాజకీయాలతో అదుపులో ఉంచు కుంది. శ్రీలంకలోని విభజన రాజకీయాలను అర్థం చేసుకోవడానికి మరీ అంతగా చరిత్రలోకి వెళ్లిపోనవసరం లేదు. 2015 నాటి ఎన్నికలు చెప్పిందీ, భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలు చెప్పబోయేదీ ఒకటే. జాతుల మత జాతీయవాదం ఎంత దృఢంగా ఉన్నప్పటికీ... అసమర్థ పాలనను, ఆర్థిక అస్తవ్యస్థతను భరించడానికి ప్రజలకు ఒక పరిమితి ఉంటుందని! దీనిని అర్థం చేసుకోడానికి మూడు పాఠాలు అవసరం. ఒకటో పాఠం. దృఢమైన జాతుల–మతజాతీయవాదం అన్నది లక్ష్యాన్ని సాధించే విధానాలకు, వివేకవంతమైన పాలనకు ప్రత్యా మ్నాయం కాబోదు. శ్రీలంకను నడుపుతున్నది సైన్యం కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. నిజానికి ఒకప్పుడు శ్రీలంక సైన్యం ప్రపంచం లోనే అత్యుత్తమమైనదిగా మన్ననలు పొందేది. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో ప్రధాన పాత్రను పోషించేది. యుద్ధ విద్యల్లో ఆరితేరిన ప్రపంచ దేశాల సైన్యంలో ప్రముఖమైనది. దేశంలో మానవ హక్కులను హరించి వేస్తోందన్న సందేహాలు మొదలయ్యే వరకు సైన్యంపై శ్రీలంకలో విశ్వాసం ఉండేది. ఏమైనా సైన్యం వంటి వ్యవస్థ వెనుక ఒక ప్రయోజనం, ప్రాధాన్యం ఉంటాయి. వాటిని పాలకులు తగ్గించడం అంటే వ్యవస్థను, తద్వారా దేశాన్ని బలహీనపరచడమే. సైన్యాన్ని అడ్డుపెట్టుకుని పాలించాలని చూసే ప్రయత్నాలను ప్రజలు తప్పక తిప్పికొడతారు. పాలకులు పాలనకు! సైనికులు రక్షణకు! అంతే. సైనిక రక్షణ.. ప్రజా ప్రయోజనాలకే తప్ప, ప్రజా వ్యతిరేక పాలనా విధానాలకు కాదని పాలకులు గ్రహించాలి. రైతులు రసాయన ఎరువులతో సేద్యం చేయకుండా చూడాలని శ్రీలంక ప్రభుత్వం నుంచి సైన్యానికి కొంతకాలం క్రితమే ఆదేశాలు అందాయి. విదేశీ మారక ద్రవ్యాన్ని ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా ఆదా చేయాలన్న తొందరపాటుతో గత ఏడాది మార్చిలో రాజపక్సే ప్రభుత్వం రసాయనాలు, పురుగుమందుల వినియోగంపై నిషేధం విధించి దేశాన్ని సైన్యం అదుపుతో ‘హరితసాగు’ పేరిట సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించే ప్రయత్నం చేసింది. సేంద్రియ వ్యవసాయానికి భూములు సిద్ధంగా లేకపోవడంతో దిగుబడులు తగ్గి ఆహార కొరత ఏర్పడింది. అయినా పదాతి దళాలతో, భారీ ఫిరం గులతో బలవంతంగా సేంద్రియ వ్యవసాయం చేయించడం ఏంటి? శ్రీలంక అనే పురాతన ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇప్పుడు పూర్వ అధ్య క్షుడు ప్రేమదాస అనుసరించిన ‘సంప్రదింపులు–రాజీ–ఏకాభి ప్రాయం’ అనే విధానం ఎంతైనా అవసరం. నైపుణ్య సామర్థ్యాలు ఉన్న పాలకపక్షం, పాలక కుటుంబం, శక్తిమంతమైన సైనికాధి కారులు, రక్షణ దళపతులు నడుపుతున్న దేశంలో ఆర్థికంగానైనా, ఆహారానికైనా ఇంతటి కొరత ఎందుకు ఉండాలి?! ఇప్పుడు కావల సింది హిట్లర్ కాదు. మండేలా! ప్రజాస్వామిక వ్యవస్థలు స్వేచ్ఛగా, దృఢంగా పనిచేసేందుకు వీలైన అనుకూలతలు ఉండాలి. రెండవ పాఠం. ప్రతి సమస్యకూ సైన్యమే సమాధానం కాదు. పాలనాపరమైన నిర్ణయాలనేవి విధానాలను అనుసరించి జరగాలి తప్ప, రాజకీయ ఉద్దేశాలతో కాదు. శ్రీలంక ప్రస్తుత ఆర్థిక సంక్షో భానికి పాలనా యంత్రాంగం తీసుకున్న రెండు కీలక రాజకీయ నిర్ణ యాలే కారణం. అంతే తప్ప కోవిడ్–19 వైరస్ కానీ, వైరస్ ఉత్పరి వర్తనాలు కానీ కాదు. మునుపటి ప్రభుత్వం విధించిన పన్నులను రద్దు చేస్తూ 2019 డిసెంబరులో ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర ప్రతికూల ప్రభావాలను చూపించింది. సాటి దేశాలతో పోలిస్తే అతి తక్కువ పన్ను రాబడులు ఉన్న దేశం శ్రీలంక. ఆ కాస్త కూడా ప్రభుత్వం రద్దు చేయడమో, తగ్గించడమో చేసింది. ఇప్పుడు బంగ్లా దేశ్‌ను చెయ్యి చాస్తోంది. ఇక రెండో ప్రతికూల నిర్ణయం, గత ఏడాది రాత్రికిరాత్రి రసాయన ఎరువుల వాడకంపై నిషేధం విధించడం. ఈ నిర్ణయాల కారణంగా ప్రజలు సైతం అప్పుల్లో కూరుకుపోయారు. తినడానికి అప్పు చేయడం... అప్పు తీర్చడానికి పస్తులు ఉండటం! వంట గ్యాసు, పాలపొడి, మందుల వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగేమాట అటుంచి, కొనేందుకు కూడా కనిపించడం లేదు. పంట దిగుబడులు పూర్తిగా పడిపోయాయి. గ్రామీణ రైతులదీ, పట్టణ వినియోగదారులదీ ఒకే పరిస్థితి. ఆర్థిక వేత్తలు, విధాన నిపుణుల సలహాలను రాజకీయ నాయకులు పెడ చెవిన పెట్టడం వల్లనే శ్రీలంకలో నేడు ఇంత అలజడి, పేదరికం. ప్రభుత్వం నమ్మబలికింది ఒకటి. ప్రజలకు దక్కుతున్నది మరొకటి! మూడో పాఠం. రోమ్ నిర్మాణం ఒక రోజులో జరగలేదు. శ్రీలంకకు షాక్‌లు మాత్రమే ఉండి, థెరపీలు లేని షాక్ థెరపీ అవసరం లేదు. – హ్యారిమ్ పీరిస్శ్రీలంక అధ్యక్షుడి మాజీ సలహాదారు -
మరోసారి బుక్కైన మిలింద్ సోమన్
పనాజీ: మొన్న వివాదాస్పద ఫోటోషూట్ వివాదంలో మోడల్ నటి పూనం పాండే, ఆమె భర్తపై కేసు నమోదు కాగా ఇలాంటి మరో వివాదంతో తాజాగా మరో మోడల్ నటుడు మిలింద్ సోమన్(55) బుక్కయ్యారు. ఈ నెల 4వ తేదీన పుట్టిన రోజు సందర్బంగా గోవాలోని ఒక బీచ్‌లో నగ్నంగా పరిగెట్టిన ఫోటో వైరల్ కావడంతో మిలింద్ఫై శుక్రవారం కేసు నమోదైంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 67, ఐపీసీ సెక్షన్ 294 కింద కొల్వా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గోవా సూరక్ష మంచ్ అనే సంస్థ ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నామని దక్షిణ గోవా ఎస్పీ పంకజ్ సింగ్ తెలిపారు. (బర్త్‌డే స్పెషల్.. బీచ్‌లో బట్టలు లేకుండా..) అనంతరం మిలింద్ సోమన్‌కు బెయిల్ లభించింది. వీడియోలు లేదా చిత్రాలు, ప్రొఫెషనల్ షూట్ వారి వారి వ్యక్తిగత విషయాలు. అయినప్పటికీ, ఏదైనా అభ్యంతరం, ప్రజా ఆగ్రహం వ్యక్తమైతే తప్ప అశ్లీలం లేదా అనైతికమైనవిగా చెప్పలేమని, భావ వ్యక్తీకరణ రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కు అని బెయిల్ ఉత్తర్వులో జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కెనకోనా అభిప్రాయపడ్డారు. మరోవైపు తనపై ఎఫ్ఐఆర్ దాఖలు కావడంపై మిలింద్ ఇంకా స్పందించలేదు. కాగా మోడలింగ్ రంగ సంచలనం మిలింద్ సోమన్‌కు వివాదాలు కొత్తేమీకాదు. ఈ తరహా ఆరోపణలను ఎదుర్కోవడం ఇది రెండవసారి. తొలిసారి బాలీవుడ్ నటి మధు సాప్రేతో కలిసి చేసిన కండోమ్ యాడ్అప్పట్లో పెద్ద సంచలనమే. 1995లో మధుసాప్రేతో కలిసి నగ్నంగా కొండ చిలువను మెడలో వేసుకొని నటించడం సెన్సేషన్‌గా మారింది. అయితే ఈ కేసులో14 సంవత్సరాల న్యాయ విచారణ తర్వాత వారిని నిర్దోషులుగా ప్రకటించడం గమనార్హం. -
ప్రొబయాటిక్‌తో స్టాఫికోకాకస్ బ్యాక్టీరియా హతం..
శరీరంలో బోలెడన్ని చెడు, మంచి బ్యాక్టీరియా ఉంటాయని మనకు చాలాకాలంగా తెలుసు. అయితే థాయ్‌లాండ్‌కు చెందిన రాజమంగళ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు యాదృచ్ఛికంగా కనుక్కున్న ఓ అంశమిప్పుడు బ్యాక్టీరియాను కూడా కొన్ని రకాల వ్యాధుల చికిత్సకు వాడుకోవచ్చునని చెబుతోంది. జీర్ణక్రియను వృద్ధి చేసేందుకు ఉపయోగించే ఓ ప్రొబయాటిక్ పదార్థంలోని లాసిల్లస్ బ్యాక్టీరియా ప్రమాదకరమైన స్టాఫిలోకాకస్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుందని వీరు గుర్తించారు.స్టాఫిలోకాకస్ బ్యాక్టీరియా శరీరంలో యాంటీబయాటిక్ నిరోధకత పెరిగేందుకు కారణమవుతుంది. ఇంకోలా చెప్పాలంటే ఏ మందు వేసుకున్నా పనిచేయకుండా ఉంటుందన్నమాట. ఈ బ్యాక్టీరియా కారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేలమంది మరణిస్తున్నారని, ముక్కుల్లో, పేవుల్లో నిద్రాణంగా ఉంటూ చర్మపు పొర దాటి బయటకు వచ్చినప్పుడు మాత్రం మృత్యుకారకమవుతోందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త యాంథొనీ ఫాసీ తెలిపారు. దాదాపు రెండు వందల మంది గ్రామీణ థాయ్‌లాండ్ ప్రజలను పరిశీలించినప్పుడు.. సుమారు స్టాఫిలోకాకస్ బ్యాక్టీరియా లేని వారిలో బాసిల్లస్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. లుకలకు బాసిల్లస్ బ్యాక్టీరియా అందించినప్పుడు వాటిలోని స్టిఫాలోకాకస్ వేగంగా నాశనమైనట్లు తెలిసింది. మనం గుర్తుంచుకునేవి.. 5000 ముఖాలే! ఒక్కసారి చూస్తే చాలు.. నేను ఎవర్నీ మరచిపోను అని ఎవరైనా అంటూంటే వెంటనే నమ్మేయకండి. ఎందుకంటే మనిషిన్నవాడు ఐదువేల కంటే ఎక్కువ ముఖాలను గుర్తుపెట్టుకోలేడని అంటున్నారు యార్క్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. సోషల్ మీడియాతోపాటు వ్యక్తిగత జీవితంలో ఎవరు ఎంతమంది ముఖాలను గుర్తుపెట్టుకోగలరో గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ఒక పరీక్ష పెట్టారు. వందమందిపై ఈ పరీక్ష జరిపినప్పుడు ఈ విషయం తెలిసింది. ఓ గంట సమయమిచ్చి.. మీకు గుర్తున్న వారందరి పేర్లు రాయాల్సిందిగా చెప్పినప్పుడు వీరు తమ పాఠశాల మిత్రులు మొదలుకొని సహాద్యోగుల వరకూ చాలామంది పేర్లు రాశారు. ఆ తరువాత కొందరు ప్రముఖుల చిత్రాలు చూపి వారిలో ఎంతమందిని గుర్తించగలరో పరీక్షించారు. సమయం గడుస్తున్న కొద్దీ పేర్లు రాసే, ముఖాలను గుర్తించే వేగం తగ్గిపోవడాన్ని ఆధారంగా చేసుకుని వాళ్లు ఎన్ని ముఖాలు గుర్తుంచుకోగలరో శాస్త్రవేత్తలు అంచనా కట్టారు. ఒకే వ్యక్తి తాలూకూ రెండు ఫొటోలను గుర్తించాలన్న నిబంధన కూడా ఉండటం వల్ల ఫలితాలు వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్నట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ జెర్కిన్స్ తెలిపారు. విమానాల్లో ఉపయోగించే ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని అంచనా. కీటోడైట్‌తో మెదడుకు మేలు! పిండిపదార్థాలు తక్కువగా, కొవ్వులు ఎక్కువగా తీసుకునే ఆహారం కీటోడైట్‌తో జ్ఞానశక్తికీ మేలు జరుగుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎలుకలపై జరిగిన ప్రయోగాల్లో కీటోడైట్‌తో వాటి మెదడు సంబంధిత ఆరోగ్యం మెరుగుపడిందని కెంటకీ యూనివర్శిటీకి చెందిన ఐ–లిన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక ప్రయోగం ప్రకారం... కీటోడైట్ అందించిన ఎలుకల నాడీ సంబంధిత క్రియలు మరింత సమర్థంగా జరిగాయి. మూర్ఛతోపాటు ఆటిజమ్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులపై కీటోడైట్ సానుకూల ప్రభావం చూపుతుందన్న గత పరిశోధనల ఆధారంగా ఐ–లిన్ తాజా ప్రయోగాలు చేపట్టారు. మెదడుకు రక్త ప్రసరణ, నాడీ సంబంధిత నాళాల ఆరోగ్యం, మెదడుకు, రక్తానికి మధ్య ఉన్న త్వచం క్రియలు సక్రమంగా జరగడం జ్ఞానశక్తికి ఎంతో కీలకమని ఈ నేపథ్యంలో కొన్ని ఎలుకలను రెండు గుంపులుగా చేసి ఒకదానికి కీటోడైట్ ఇంకోదానికి సాధారణ ఆహారం అందించామని ఐ–లిన్ తెలిపారు. దాదాపు పదహారు వారాల తరువాత పరిశీలించినప్పుడు కీటోడైట్ ఇచ్చిన ఎలుకల మెదళ్లకు రక్తప్రసరణ మెరుగైందని, పేవుల్లోని బ్యాక్టీరియాలో సమతౌల్యత కనిపిచిందని వివరించారు. కీటో ఆహారం మెకనిస్టిక్ టార్గెట్ ఆఫ్ రాపమైసిన్ అనే రసాయనం ఉత్పత్తిని నిరోధించడం దీనికి కారణం కావచ్చునని అన్నారు. కీటోడైట్ కాకుండా.. కేలరీలను తక్కువ చేసినప్పుడు మాత్రమే శరీరంలో ఈ రాపమైసిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. కీటోడైట్ మనుషుల్లోనూ ఇదే రకమైన ఫలితాలు చూపుతుందా? లేదా? అన్నది నిర్ధారించుకోవాల్సి ఉందని అన్నారు. -
మీరు మొహంలో ఎటువైపు చూస్తున్నారు?
లండన్: మీరు ఎదురుగా నిల్చున్న వారి మొహం లోకి చూస్తూ మాట్లాడుతున్నారా. అయితే ఆ మొహంలో మీరు ఎటువైపు చూస్తున్నారు. అంటే కుడివైపు చూస్తున్నారా.. ఎడమవైపు చూస్తున్నారా. ఎటు చూస్తే ఏంటి.. ఇవేం ప్రశ్నలు అనుకోకండి. పురుషులు, స్త్రీలు తమ ఎదురుగా ఉన్నవారి మొహాల్లోకి చూసే తీరులో స్పష్టమైన తేడా ఉంటుందని క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. లింగపరమైన భేదాలపై అధ్యయనంలో భాగంగా జరిపిన పరిశోధనలో.. పురుషులు, స్త్రీలు చూసే విధానంలో తేడా ఉంటుందని గుర్తించారు. సుమారు 500 మందిపై ఐదువారాల పాటు నిర్వహించిన పరిశీలనలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. ‘ఐ ట్రాకింగ్ డివైస్’ సహాయంతో నిర్వహించిన ఈ పరిశోధనలో మహిళలు కంప్యూటర్ తెరపై ఎదురుగా ఉన్న మొహంలో ఎక్కువగా ఎడమ వైపు చూస్తున్నారని తేలింది. ముఖ్యంగా ఎడమ కంటి భాగంలో వారి ఫోకస్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అయితే.. వేరువేరు కల్చర్లు దీనిపై ప్రభావం చూపుతున్నాయా అనేది తెలుసుకోవడానికి సుమారు 60 దేశాలకు చెందిన వారిని తీసుకొని పరిక్షించినా ఇవే ఫలితాలు వచ్చాయి. ఎదురుగా ఉన్న స్క్రీన్‌పై చూసే విధానాన్ని బట్టి.. ఆ వ్యక్తి జెండర్‌ను చెప్పడానికి 80 శాతం అవకాశం ఉందని పరిశోధనకు నేతృత్వం వహించిన ఆంటోని కౌట్రోట్ తెలిపారు. -
'ఓ సింహమా.. ఇది నా ఇల్లు'
న్యూయార్క్: సాధారణంగా కుక్కను చూస్తేనే పిల్లి అమాంతం లగెత్తుతుంది. అలాంటిది ఇక సింహాన్ని చూస్తే పరిస్థితి ఏంటి. అది కూడా కళ్లలోకి కళ్లుపెట్టి పంజా విసురుతున్నా ఏమాత్రం జంకూబొంకూ లేకుండా కనీసం పట్టించుకోకుండా ఉంటే ఎలా ఉంటుంది.. అమెరికాలోని ఓ ఇంట్లో పిల్లి ఇలాగే చేసింది. ఓ ఇంటి యజమానులు తమ ఇంట్లో రెండు పిల్లులను పెంచుకుంటున్నారు. ఆ ఇల్లు ఓ అటవీ, కొండ ప్రాంతం మధ్యలో ఉండటంతో అప్పుడప్పుడు క్రూరమృగాల చప్పుళ్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఓ రోజు పిల్లి నివాసం ఉంటున్న ఆ ఇంటి గుమ్మం వద్దకు ఓ సింహం వచ్చింది. గుమ్మం అవతల సింహం.. గుమ్మం ఇవతలిపక్క పిల్లి. ఆ సింహాన్ని చూసి అది పరుగెత్తిందా అంటే అదేం జరగలేదు. ఏంచక్కా దానిని ఓ సాధారణ జంతువులా చూసింది. అది గాండ్రుగాండ్రుమంటున్నా చెవులు వినిపించనట్లు.. పంజావిసురుతున్న పట్టనట్లు దానివైపే చూసింది. ఈ చర్యను చూసిన సింహం.. చిరాకుతో దానిని పట్టుకునేందుకు ప్రయత్నం చేసింది. చివరికి ఏం చేసేది లేక వెనుదిరిగి వెళ్లిపోయింది. మరికాసింత దూరం వెళ్లి ఆ గుమ్మంలో ఉన్న పిల్లివైపు చూసి.. లాభం లేకపోవడంతో ఇక చేసేది మళ్లీ అడవి బాట పట్టింది. ఈలోపు మరోపిల్లి వచ్చి ఏం జరిగింది అన్నట్లుగా డేర్‌గా ఉన్న పిల్లితో ముచ్చటించడం మొదలుపెట్టింది. ఇంతకీ ఆ పిల్లిని సింహం ఎందుకు ఏం చేయలేకపోయిందని అనుకుంటున్నారా.. మరేం లేదు. ఆ గుమ్మానికి అద్దంతో చేసిన తలుపులు బిగించి ఉన్నాయి. అందుకే సింహం గుమ్మం దాటి రాలేకపోయింది. పిల్లి దర్జాగా కూర్చుంది. దీనికి సంబంధించిన వీడియోను మాబెల్ అనే వ్యక్తి యూట్యూబ్‌లో పెట్టగా షికారు చేస్తోంది. -
పౌరాణిక జ్ఞానం
శివుడు శ్మశానంలో ఎందుకుంటాడు? బ్రహ్మకి మూడు తలలే కనిపిస్తాయెందుకు? శివుడు లయకర్త. లయమంటే ముగింపు. అది జరిగేది శ్మశానంలోనే కదా! అందుకే ఆయన శ్మశానంలో ఉంటాడు. బ్రహ్మకి అసలు శిరస్సులు ఐదు. శంకరుడు ఒకటి ఖండిస్తే నాలుగు తలలవాడయ్యాడు. మనం గోడమీద చెక్కిన శిల్పాన్ని చూస్తూండడం వల్ల మూడు ముఖాలు కల్గినవానిగా కన్పిస్తూ ఉండవచ్చు గాని ఆయనకి నాలుగు దిక్కులనీ చూస్తూ నాలుగు ముఖాలు ఉంటాయి. అప్సరసల్ని పంపి తపస్సును చెడగొట్టే లక్షణమున్న ఇంద్రుడు దేవతలకు రాజెలా అయ్యాడు? ఇంద్రునిది పరీక్షాధికారి పదవి. ఎవరైనా తపస్సు ప్రారంభించగానే వారిది ఏ స్థాయి తపస్సో, ఎంత గాఢ తపస్సో పరీక్షించవలసిన బాధ్యతనీ ధర్మాన్నీ దేవతలు ఈయన మీద ఉంచారు. అందుచేత ఇంద్రుడు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే ఆరింటిలోనూ ఒకదాని తర్వాత ఒకటి చొప్పున పరీక్షలు నిర్వహిస్తాడు. ఓడిపోవడమనేది (కామంలో మేనకతో విశ్వామిత్రుడు, క్రోధంలో అహల్య విషయంలో గౌతముడు.. ఇలా) ఆ రుషుల త ప్పు తప్ప, పరీక్షించ వచ్చిన అప్సరసలదీ కాదు- వారిని పంపించిన ఇంద్రునిది ఏమాత్రమూ కాదు! దర్భలకి అంతటి పవిత్రత ఎలా వచ్చింది? శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించినప్పుడు దాని పైన మందర పర్వతంతో దేవదానవులు చిలకడం జరిగింది. ఆ సందర్భంలో విష్ణువు పైనున్న రోమాలు నేల మీద పడగా అవి దర్భలుగా భూమినుండి మొలకెత్తాయి. ఇక గరుడుడు అమృతభాండాన్ని ఉంచింది ఈ దర్భలమీదే! అలా అమృతాన్ని తమ మీద ధరించినవి కూడ కాబట్టి వీటికింతటి పవిత్రత. -
కేంద్ర మంత్రి జేడీ శీలంకు సమైక్య సెగ
తెనాలిఅర్బన్/రూరల్, న్యూస్‌లైన్: సమైక్య సెగ కేంద్ర మంత్రి జేడీ శీలంను తాకింది. సమైక్యవాదులు ఆయనతో గంటసేపు వాగ్వాదానికి దిగారు. సమైక్యవాదివైతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. క్యాబినెట్లో ఉండి కేంద్రానికి సమైక్యవాదుల మనోభావాలను వివరిస్తానని మంత్రి చెప్పారు. అయినా శాంతించని సమైక్యవాదులు ఆయనను ఘెరావ్ చేశారు. స్థానిక జేఎంజే మహిళా కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి జేడీ శీలం శనివారం తెనాలి వచ్చారు. మంత్రి కళాశాలలో ఉన్నారన్న విషయం తెలుసుకున్న సమైక్యవాదులు అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులను లోనికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో వారు గేటు ముందు బైటాయించారు. జేడీ శీలం రాజీనామా చేయాలి.. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు పలకాలంటూ నినాదాలు చేశారు. అక్కడే కబడ్డీ ఆడుతూ రాస్తారోకో చేశారు. మధ్యాహ్నం 12గంటల నుంచి ఆందోళన ప్రారంభంకాగా, 1.15 గంటల సమయంలో బయటకు వచ్చిన మంత్రిని దాదాపు గంటసేపు సమైక్యవాదులు నిలువరించారు. కేంద్రంలో జరిగే పరిణామాలు తెలియవా? రాష్ట్రం అగ్నిగుండంగా మారుతున్నా చలనం లేదా? ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు చేస్తున్న ఆందోళనలు పట్టవా అంటూ నిలదీశారు. రాష్ట్రం నష్టపోయే తీరును అధిష్టానానికి వివరించలేరా? అంటూ ప్రశ్నలవర్షం కురిపించారు. రాష్ట్రవిభజనపై నిర్ణయం చెప్పాలని, సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించాలని పట్టుబట్టారు. సమైక్యాంధ్ర జేఏసీ డివిజన్ కన్వీనర్ అన్నాబత్తుని సదాశివరావు, కోఆర్డినేటర్ షేక్ జానీబాషా, కో కన్వీనర్ గళ్లా చందు, ఏపీఎన్జీవో అసోసిసియేషన్ అధ్యక్షుడు బి.కృష్ణమోహన్ వాదనలను పూర్తిగా విన్నారు. మిన్నంటిన సమైక్య నినాదాలు..అనంతరం కేంద్రమంత్రి జేడీ శీలం మాట్లాడుతూ మంత్రుల రాజీనామాలు కోరేటపుడు, ఉద్యమంలో పాల్గొనే ఉద్యోగులు ఎందుకు రాజీనామా చేయరని ప్రశ్నించండంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉద్యోగులు 60 ఏళ్ల పదవీకాలానికి రాజీనామా చేస్తే, కేవలం ఆరునెలలు కేంద్రంలో కొనసాగే మీరు వారి జీవితాలకు భరోసా ఇవ్వగలరా అంటూ గళ్లా చందు నిలదీశారు. ఈ సమయంలో సమైక్యాంధ్ర నినాదాలు మిన్నంటాయి. అనంతరం జేడీ శీలం మాట్లాడుతూ మంత్రుల రాజీనామాలతో ఒరిగేదేమీ లేదన్నారు. రాజీనామా చేస్తే క్యాబినెట్లో జరిగే విషయాలు తెలియవని, కేంద్రంలో ఉండి, సమైక్యవాదుల ప్రతినిధిగా ఆందోళనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని చెప్పి, కళాశాలలోకి వె ళ్లిపోయారు. కేంద్రమంత్రి వెంట వచ్చిన సీమాంధ్ర జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్.శామ్యుల్ మౌనంగా ఉండడాన్ని ఆక్షేపించారు. మంత్రిని మీరెందుకు నిలదీయరంటూ శామ్యుల్పై ప్రశ్నలవర్షం కురిపించారు. మంత్రి సమాధానంపై సంతృప్తి చెందని నాయకులు ఆయనను ఘెరావ్ చేసి వెనుదిరిగారు. ఆందోళనలో ఏపీఎన్జీవోస్ అసోసియేట్ అధ్యక్షుడు కేవీ గోపాలకృష్ణ, హరిప్రసాద్, సుబ్రహ్మణ్యం, వ్యాపార జేఏసీ నాయకులు నంబూరు నరేంద్ర, అబ్దుల్ వహీద్, కె.శ్రీనివాస్, పసుమర్తి రఘు, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.