మీరు మొహంలో ఎటువైపు చూస్తున‍్నారు? | Women and men look at faces differently | Sakshi
Sakshi News home page

మీరు మొహంలో ఎటువైపు చూస్తున‍్నారు?

Published Tue, Nov 29 2016 12:18 PM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM

మీరు మొహంలో ఎటువైపు చూస్తున‍్నారు?

మీరు మొహంలో ఎటువైపు చూస్తున‍్నారు?

లండన్‌: మీరు ఎదురుగా నిల్చున్న వారి మొహం లోకి చూస్తూ మాట్లాడుతున్నారా. అయితే ఆ మొహంలో మీరు ఎటువైపు చూస్తున్నారు. అంటే కుడివైపు చూస్తున్నారా.. ఎడమవైపు చూస్తున్నారా. ఎటు చూస్తే ఏంటి.. ఇవేం ప్రశ్నలు అనుకోకండి. పురుషులు, స్త్రీలు తమ ఎదురుగా ఉన్నవారి మొహాల్లోకి చూసే తీరులో స్పష్టమైన తేడా ఉంటుందని క్వీన్‌ మేరీ యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

లింగపరమైన భేదాలపై అధ్యయనంలో భాగంగా జరిపిన పరిశోధనలో.. పురుషులు, స్త్రీలు చూసే విధానంలో తేడా ఉంటుందని గుర్తించారు. సుమారు 500 మందిపై ఐదువారాల పాటు నిర్వహించిన పరిశీలనలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. ‘ఐ ట్రాకింగ్‌ డివైస్‌’ సహాయంతో నిర్వహించిన ఈ పరిశోధనలో మహిళలు కంప్యూటర్‌ తెరపై ఎదురుగా ఉన్న మొహంలో ఎక్కువగా ఎడమ వైపు చూస్తున్నారని తేలింది. ముఖ్యంగా ఎడమ కంటి భాగంలో వారి ఫోకస్‌ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

అయితే.. వేరువేరు కల్చర్‌లు దీనిపై ప్రభావం చూపుతున్నాయా అనేది తెలుసుకోవడానికి సుమారు 60 దేశాలకు చెందిన వారిని తీసుకొని పరిక్షించినా ఇవే ఫలితాలు వచ్చాయి. ఎదురుగా ఉన్న స్క్రీన్‌పై చూసే విధానాన్ని బట్టి.. ఆ వ్యక్తి జెండర్‌ను చెప్పడానికి 80 శాతం అవకాశం ఉందని పరిశోధనకు నేతృత్వం వహించిన ఆంటోని కౌట్రోట్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement