Odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు భారతీయ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) బాసటగా నిలిచింది. ఇన్సూరెన్స్ క్లయిమ్ కోసం డెత్ సర్టిఫికేట్ అవసరాన్ని మినహాయించి, క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను సడలించనున్నట్లు ఎల్‌ఐసీ చైర్‌పర్సన్ సిద్ధార్థ మహంతి తెలిపారు.
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం పట్ల ఎల్‌ఐసీ ఆఫ్ ఇండియా తీవ్ర విచారం వ్యక్తం చేస్తోందని మహంతి పేర్కొన్నారు. మృతులు, బాధితులకు బాసటగా నిలుస్తుందని, ఆర్థిక ఉపశమనం అందించడానికి క్లయిమ్ సెటిల్‌మెంట్‌లను వేగవంతం చేస్తుందని చైర్‌పర్సన్ వివరించారు. ఎల్‌ఐసీ పాలసీల క్లయిమ్‌దారులు, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీదారుల కష్టాలను తగ్గించడమే దీని లక్ష్యం అని తెలిపారు.
రిజిస్టర్డ్ డెత్ సర్టిఫికేట్‌లకు బదులుగా రైల్వే అధికారులు, పోలీసులు, ఏదైనా రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రచురించిన మరణాల జాబితాను పాలసీదారుల మరణానికి రుజువుగా అంగీకరించనున్నట్లు ఎల్‌ఐసీ చైర్‌పర్సన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే క్లయిమ్ సంబంధిత సందేహాలకు నివృత్తికి, హక్కుదారులకు సహాయం అందించడానికి డివిజనల్, బ్రాంచ్ స్థాయిలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ఇదీ చదవండి: రైలు ప్రయాణ బీమా గురించి తెలుసా? కేవలం 35 పైసలే..
Comments
Please login to add a commentAdd a comment