రిలాక్స్‌కావాలి బాసూ | Anushka Relax Linga moive | Sakshi
Sakshi News home page

రిలాక్స్‌కావాలి బాసూ

Published Mon, Aug 25 2014 11:53 PM | Last Updated on Sat, Sep 2 2017 12:26 PM

రిలాక్స్‌కావాలి  బాసూ

రిలాక్స్‌కావాలి బాసూ

యంత్రంలా పని చేస్తున్న నటి అనుష్కకు రిలాక్స్ కావాలట. తమిళంలో రజనీకాంత్ సరసన లింగా, అజిత్‌కు జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంతోపాటు తెలుగులో భారీ చారిత్రాత్మక చిత్రాలు బాహుబలి, రుద్రమదేవి చేస్తున్నారు. వీటిలో బాహుబలి, రుద్రమదేవి చిత్రాలకు దాదాపు రెండేళ్లకు పైగా పని చేస్తున్నారు. ఇలాంటి సంచలన చిత్రాల్లో ఒకదానికి తరువాత ఒకటి చేస్తూ, ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా నటిస్తూ వస్తున్నారు. అదే విధంగా ఈ చిత్రాల షూటింగ్‌ల కోసం చెన్నై టూ హైదరాబాద్, బెంగుళూర్ తదితర ప్రాంతాలకు గాలిలోనే విహంగ పయనం (విమానయానం) చేయాల్సి వస్తోంది. ఎంతయినా అనుష్క కూడా మనిషే కదా? అందులోనూ మగువ. కాస్త రిలాక్స్ చాలా అవసరం. ఇలాంటి విశ్రాంతి సమయాన్ని కోరుకుంటున్నారు. చిత్రాల ఒత్తిడి వల్ల సాధ్యం కాలేదు.
 
 అయితే ప్రస్తుతం నటిస్తున్న రజనీకాంత్ లింగా, అజిత్ చిత్రాలతో అనుష్క నటించాల్సిన సన్నివేశాలు దాదాపు పూర్తి అయ్యాయి. అలాగే తెలుగు చిత్రాల షూటింగ్‌లకు చిన్న విరామం దొరకడంతో అమ్మడు రిలాక్స్ కోసం పది రోజులపాటు సినిమా ప్రపంచానికి దూరంగా నచ్చిన ప్రాంతాల్లో స్వేచ్చా విహారానికి రెడీ అవుతున్నారు. విశేషం ఏమిటంటే ఆమె విహార యాత్ర ప్రాంతాలను కూడా వెల్లడించడానికి నో అంటున్నారట. ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక మొబైల్ కంపెనీకి అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. తన విహార యాత్రను ముగించుకుని వచ్చిన తరువాత ఆ వాణిజ్య ప్రకటన కోసం నటించనున్నారని తెలిసింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement