సో స్వీట్! | so sweet to anushka | Sakshi
Sakshi News home page

సో స్వీట్!

Nov 7 2015 12:02 AM | Updated on Sep 3 2017 12:08 PM

సో స్వీట్!

సో స్వీట్!

2015 అనుష్కదే అంటే అతిశయోక్తి కాదు. ‘బాహుబలి, రుద్రమదేవి’ చిత్రాల్లో వీర వనితగా ఆమె కనబరిచిన అభినయం ‘భేష్’ అని

2015 అనుష్కదే అంటే అతిశయోక్తి కాదు. ‘బాహుబలి, రుద్రమదేవి’ చిత్రాల్లో వీర వనితగా ఆమె కనబరిచిన అభినయం ‘భేష్’ అని ప్రేక్షకులు కితాబులిచ్చేశారు. ఏక కాలంలో రెండు భారీ చిత్రాలు చేయడం ఓ విశేషమైతే, అందులో ఒకటి లేడీ ఓరియంటెడ్ మూవీ కావడం మరో విశేషం. ఈ రెండు చిత్రాలతో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అంటే అనుష్కే చేయాలి అన్నట్లు చాలామంది ఫిక్సయ్యారు. ఇక, ఈ నెల 27న మరో డిఫరెంట్ మూవీ ‘సైజ్ జీరో’తో తెరపై మెరవనున్నారు అనుష్క. కోవెలమూడి ప్రకాశ్ దర్శకత్వంలో పీవీపీ పతాకంపై పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నే నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన లభించింది.

యు ట్యూబ్‌లో పది లక్షల మంది వీక్షించారంటే మాటలు కాదు. దాన్నిబట్టి... ఈ చిత్రంపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ఊహించుకోవచ్చు. ఇది ఇలా ఉంటే... నేడు అనుష్క పుట్టినరోజు. ఈ బర్త్‌డే ఆమెకు ప్రత్యేకం అనే చెప్పాలి. ఎందుకంటే, పదేళ్లుగా అనుష్క చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆమె చేసిన ‘బాహుబలి, రుద్రమదేవి’ చిత్రాలు మరో ఎత్తు అనే చెప్పాలి. నటిగానే కాదు... మంచి మనిషిగా కూడా అనుష్కకు చాలా పేరు ఉంది. ఆమె ముద్దు పేరు స్వీటీ. ఆ పేరుకి తగ్గట్టుగానే అనుష్క సో స్వీట్ అని పరిశ్రమవర్గాలు అంటుంటాయి. హ్యాపీ బర్త్‌డే ‘స్వీటీ’!
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement