మొదట్లో అలానే ఉండేదాన్ని | I Don't Wear Makeup On Outside Programmes :Anushka | Sakshi
Sakshi News home page

మొదట్లో అలానే ఉండేదాన్ని

Published Tue, May 1 2018 8:33 AM | Last Updated on Tue, May 1 2018 8:33 AM

I Don't Wear Makeup On Outside Programmes :Anushka - Sakshi

తమిళసినిమా: ముందు అనుసరించినా, తరువాత మారానని అన్నారు నటి అనుష్క. అగ్రనటిగా రాణిస్తున్న ఈ బ్యూటీ ఎలాంటి పాత్రనైనా అవలీలగా నటించి మెప్పించేస్తారు. చారిత్రక, పౌరాణిక పాత్రల్లో నటించడానికి ఆమెకు ఆమే సాటి. రుద్రమదేవి,  బాహుబలి, నమో వేంకటేశాయ చిత్రాలే ఇందుకు సాక్షి. ఇక అరుంధతి, భాగమతిలోనూ విశ్వరూపం చూపించారు. అలాంటిది భాగమతి తరువాత ఆమె తదుపరి చిత్రం గురించి ఎలాంటి సమాచారం రాలేదు. దర్శకుడు గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించానని ఇంతకు ముందొకసారి చెప్పారు. అది ఎప్పుడు మొదలవుతుందో తెలియదుగాని, తాజాగా ఒక చిత్రంలో నటించే విషయమై కథను వింటున్నారట.

ఆ మధ్య ఇంజి ఇడుప్పళగి చిత్రం కోసం బరువు పెరిగిన ఈ స్వీటీ దాన్ని తగ్గించుకోవడానికి కాస్త ఎక్కువగానే శ్రమ పడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పూర్వపు అందాలను తెచ్చుకునే ప్రయత్నంలో కసరత్తులు చేస్తున్నారు. ఈ సందర్భంగా అనుష్క తన సినీ, వ్యక్తిగత జీవితం గురించి ఇంటర్వ్యూలో పేర్కొంటూ తాను నటించేది సినిమాల్లోనేననీ, నిజ జీవితంలో తనకు నచ్చినట్లు నడుచుకుంటానని చెప్పారు. సినీ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని ఒకటిగా చూడనని చెప్పారు. నటిగా రంగప్రవేశం చేసిన తొలి రోజుల్లో ఇకపై బహిరంగ కార్యక్రమాలకు కూడా మేకప్‌ వేసుకుని మంచి మోడరన్‌ దుస్తులు ధరించి వెళ్లాలని సలహాలిచ్చారన్నారు. వారి సూచనలను కొంత కాలం అనుసరించినా, ఆ తరువాత మారిపోయానని చెప్పారు. తనకు నచ్చినట్టు ఉండడం సౌకర్యంగా ఉంటుందన్నారు. చిత్రం సక్సెస్‌ అయితే ప్రతిభావంతులు, ఫ్లాప్‌ అయితే ప్రతిభ లేదని అనడం కరెక్ట్‌ కాదని అనుష్క పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement