Bhagmathi
-
బాలీవుడ్ భాగమతి
గత ఏడాది ‘భాగమతి’గా అనుష్క ప్రేక్షకులను భయపెట్టి, మంచి బాక్సాఫీస్ వసూళ్లు సాధించారు. అనుష్క లేడీ ఓరియంటెడ్ సినిమాల హిట్ లిస్ట్‌లోకి ‘భాగమతి’ కూడా చేరింది. ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్ కాబోతోందని తెలిసింది. ఈ చిత్రం రీమేక్ హక్కులను విక్రమ్ మల్హోత్రా తీసుకున్నారు. ఇందులో అనుష్క పోషించిన పాత్రను భూమి పెడ్నేకర్ చేస్తారని సమాచారం. తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన జి.అశోక్ ఈ రీమేక్‌ను డైరెక్ట్ చేయనున్నట్టు బాలీవుడ్ టాక్. ప్రస్తుతం భూమి పెడ్నేకర్ ‘సాంద్ కీ ఆంఖ్, బాలా’ సినిమాల రిలీజ్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. ‘సాంద్ కీ ఆంఖ్’లో 90ఏళ్ల గన్ షూటర్‌గా నటించారామె. -
మొదట్లో అలానే ఉండేదాన్ని
తమిళసినిమా: ముందు అనుసరించినా, తరువాత మారానని అన్నారు నటి అనుష్క. అగ్రనటిగా రాణిస్తున్న ఈ బ్యూటీ ఎలాంటి పాత్రనైనా అవలీలగా నటించి మెప్పించేస్తారు. చారిత్రక, పౌరాణిక పాత్రల్లో నటించడానికి ఆమెకు ఆమే సాటి. రుద్రమదేవి, బాహుబలి, నమో వేంకటేశాయ చిత్రాలే ఇందుకు సాక్షి. ఇక అరుంధతి, భాగమతిలోనూ విశ్వరూపం చూపించారు. అలాంటిది భాగమతి తరువాత ఆమె తదుపరి చిత్రం గురించి ఎలాంటి సమాచారం రాలేదు. దర్శకుడు గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించానని ఇంతకు ముందొకసారి చెప్పారు. అది ఎప్పుడు మొదలవుతుందో తెలియదుగాని, తాజాగా ఒక చిత్రంలో నటించే విషయమై కథను వింటున్నారట. ఆ మధ్య ఇంజి ఇడుప్పళగి చిత్రం కోసం బరువు పెరిగిన ఈ స్వీటీ దాన్ని తగ్గించుకోవడానికి కాస్త ఎక్కువగానే శ్రమ పడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పూర్వపు అందాలను తెచ్చుకునే ప్రయత్నంలో కసరత్తులు చేస్తున్నారు. ఈ సందర్భంగా అనుష్క తన సినీ, వ్యక్తిగత జీవితం గురించి ఇంటర్వ్యూలో పేర్కొంటూ తాను నటించేది సినిమాల్లోనేననీ, నిజ జీవితంలో తనకు నచ్చినట్లు నడుచుకుంటానని చెప్పారు. సినీ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని ఒకటిగా చూడనని చెప్పారు. నటిగా రంగప్రవేశం చేసిన తొలి రోజుల్లో ఇకపై బహిరంగ కార్యక్రమాలకు కూడా మేకప్ వేసుకుని మంచి మోడరన్ దుస్తులు ధరించి వెళ్లాలని సలహాలిచ్చారన్నారు. వారి సూచనలను కొంత కాలం అనుసరించినా, ఆ తరువాత మారిపోయానని చెప్పారు. తనకు నచ్చినట్టు ఉండడం సౌకర్యంగా ఉంటుందన్నారు. చిత్రం సక్సెస్ అయితే ప్రతిభావంతులు, ఫ్లాప్ అయితే ప్రతిభ లేదని అనడం కరెక్ట్ కాదని అనుష్క పేర్కొన్నారు. -
వదల బొమ్మాళీ వదలా!
తమిళసినిమా: వదల బొమ్మాళీ వదలా ఈ పదం వింటే టక్కున గుర్తొచ్చేది నటి అనుష్కనే. తను నటించిన అరుంధతి చిత్రం ఎంతగా ఘన విజయం సాధించిందో, అంతగా అందులోని ఆ సంభాషణలు ప్రాచుర్యం పొందాయి. ఆ చిత్రంలోని వదల బొమ్మాళీ వదల సంభాషణల్లా నటి అనుష్కను వదంతులు వదల కుండా వెంటాడుతూనే ఉన్నాయి. నటుడు ప్రభాస్‌తో ఎక్కువ చిత్రాల్లో నటించిన నటి అనుష్కనే. అదే విధంగా ఈ జంట నటించిన చిత్రాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో సహజంగానే వీరి గురించి గ్యాసిప్ ప్రచారం అవుతుంటాయి. ప్రభాస్, అనుష్క ప్రేమించుకుంటున్నారని, పెళ్లికి రెడీ అవుతున్నారన్న రకరకాల వదంతులు చాలాకాలంగా ప్రచారంలో ఉన్నాయి. అలాంటి వదంతులను ఆ జంట ఖండించినా వదల బొమ్మాళీ వదలా అన్నట్లుగా ప్రచారం అవుతూనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఒక వదంతే సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే నటి అనుష్క గత 7వ తేదీన పుట్టినరోజును జరుపుకుంది. అదే రోజు తాను నటించిన భాగమతి చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేశారు.దాన్ని ప్రభాస్ తన ట్విట్టర్లో పోస్ట్ చేసి అనుష్కకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన అనుష్కకు ఖరీదైన కారును బహుమతిగా అందించారనే ప్రచారం హల్చల్ చేస్తోంది.అదే విధంగా ప్రభాష్ పుట్టిన రోజున అనుష్క ఆయనకు ఖరీదైన వాచ్‌ను బహుమతిగా అందించినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. -
భాగమతిలో బాలీవుడ్ బ్యూటి
తెలుగు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తరువాత బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ముద్దుగుమ్మ టబు. అడపాదడపా సౌత్ సినిమాల్లోనూ కనిపిస్తున్న ఈ బ్యూటి, ఇటీవల సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తుంది. తాజాగా దృశ్యం బాలీవుడ్ రీమేక్‌లో తనదైన నటనతో మెప్పించిన టబు మరో ఇంట్రస్టింగ్ సినిమాతో సౌత్ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. అనుష్క లీడ్ రోల్లో పిల్ల జమీందార్ ఫేం అశోక్ తెరకెక్కిస్తున్న సినిమా భాగమతి. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్కతో పాటు మరో కీలక పాత్రలో టబు నటించనుందట. ఈ సినిమాలో టబు, అనుష్క తల్లిగా నటిస్తుందన్న టాక్ వినిపిస్తున్నా.. యూనిట్ సభ్యుల నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. -
అనుష్క జోడిగా మళయాల స్టార్
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో చేతినిండా సినిమాలతో యమా బిజీగా ఉన్న హీరోయిన్ అనుష్క. బాహుబలి పార్ట్ 2తో పాటు సింగం సిరీస్‌లో వస్తున్న ఎస్ 3 సినిమాలలో నటిస్తున్న ఈ బ్యూటి, మరో లేడి ఓరియంటెడ్ సినిమాకు రెడీ అవుతోంది. పిల్లజమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థ్రిల్లర్ సినిమాలో ప్రధాన పాత్రలోనటిస్తోంది. భాగమతి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్క సరసన హీరోగా మళయాల స్టార్ ఉన్ని ముకుందన్ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ సినిమాలో విలన్‌గా నటిస్తున్న ముకుందన్, మరోసారి తెలుగు సినిమాలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది.