తమిళసినిమా: వదల బొమ్మాళీ వదలా ఈ పదం వింటే టక్కున గుర్తొచ్చేది నటి అనుష్కనే. తను నటించిన అరుంధతి చిత్రం ఎంతగా ఘన విజయం సాధించిందో, అంతగా అందులోని ఆ సంభాషణలు ప్రాచుర్యం పొందాయి. ఆ చిత్రంలోని వదల బొమ్మాళీ వదల సంభాషణల్లా నటి అనుష్కను వదంతులు వదల కుండా వెంటాడుతూనే ఉన్నాయి. నటుడు ప్రభాస్‌తో ఎక్కువ చిత్రాల్లో నటించిన నటి అనుష్కనే. అదే విధంగా ఈ జంట నటించిన చిత్రాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో సహజంగానే వీరి గురించి గ్యాసిప్ ప్రచారం అవుతుంటాయి. ప్రభాస్, అనుష్క ప్రేమించుకుంటున్నారని, పెళ్లికి రెడీ అవుతున్నారన్న రకరకాల వదంతులు చాలాకాలంగా ప్రచారంలో ఉన్నాయి.
అలాంటి వదంతులను ఆ జంట ఖండించినా వదల బొమ్మాళీ వదలా అన్నట్లుగా ప్రచారం అవుతూనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఒక వదంతే సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే నటి అనుష్క గత 7వ తేదీన పుట్టినరోజును జరుపుకుంది. అదే రోజు తాను నటించిన భాగమతి చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేశారు.దాన్ని ప్రభాస్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసి అనుష్కకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన అనుష్కకు ఖరీదైన కారును బహుమతిగా అందించారనే ప్రచారం హల్‌చల్ చేస్తోంది.అదే విధంగా ప్రభాష్ పుట్టిన రోజున అనుష్క ఆయనకు ఖరీదైన వాచ్‌ను బహుమతిగా అందించినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment