అనుష్కే స్పందించాలి | Social Media rumours On Anushka shetty Marriage | Sakshi
Sakshi News home page

ఇందులో నిజం ఎంతన్నది అనుష్కే స్పందించాలి

Published Tue, May 29 2018 8:31 AM | Last Updated on Tue, May 29 2018 10:09 AM

Social Media rumours On Anushka shetty Marriage - Sakshi

తమిళసినిమా: సినిమానే కాదు ఏ రంగంలోనైనా విమర్శించే వారు ఉంటారు. మన పని చాలా మందికి సమంజసంగా ఉన్నా, కొంతమందికి అసమంజసంగా ఉంటుంది. విమర్శలు అలానే పుడుతుంటాయి. నటి అనుష్కనే తీసుకుంటే. టాప్‌ హీరోయిన్‌. ఎలాంటి పాత్రనైనా అవలీలగా నటించేయగల సత్తా ఉన్న నటి. అయినా తనూ అందరిలాంటి మగువే. తనకూ వ్యక్తిగత అంశాలు ఉంటాయి. ఇటీవల కాస్త విరామం లభించడంతో ఆలయాలకు వెళ్లి దైవ దైర్శనం చేసుకున్నారు. దీన్ని కూడా భూతద్దంలో చూపుతూ అనుష్క పెళ్లి కోసం పుజలు నిర్వహిస్తున్నారు. దోష పరిహారాల కోసమే పూజలు, పునస్కారాలు అంటూ  ఇష్టం వచ్చినట్లు ప్రసారం చేసేస్తున్నారు.

అనుష్క భాగమతి చిత్రం తరువాత కొత్త చిత్రం ఏదీ అంగీకరించలేదు. అయితే మలయాళంలో నటించబోతోందని, తమిళంలోనూ ఒక చిత్రం కమిట్‌ అయ్యింది లాంటి బేస్‌లెస్‌ ప్రసారాలు సామాజిక మాద్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇలాంటివి వినీ, వినీ విసిగిపోయిన అనుష్క గురించి తాజాగా మరో ప్రచారం హల్‌చల్‌ చేస్తోంది. ఈ స్వీటీ త్వరలో పెళ్లికి సిద్ధం అవుతోందని, అందుకే నూతన చిత్రాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటోందని, ముఖ్యంగా హీరోతో సన్నిహితంగా ఉండేలాంటి సన్నివేశాలు, గ్లామరస్‌ సన్నివేశాలు ఉండకూడదని దర్శక నిర్మాతలకు నిబంధనలు విధిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజం ఎంత అన్నది అనుష్క స్పందిస్తే గానీ తెలియదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement