భాగమతిలో బాలీవుడ్ బ్యూటి | Tabu With Anushka In Bhagmathi | Sakshi
Sakshi News home page

భాగమతిలో బాలీవుడ్ బ్యూటి

Published Sat, Jul 23 2016 1:08 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

భాగమతిలో బాలీవుడ్ బ్యూటి

భాగమతిలో బాలీవుడ్ బ్యూటి

తెలుగు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తరువాత బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ముద్దుగుమ్మ టబు. అడపాదడపా సౌత్ సినిమాల్లోనూ కనిపిస్తున్న ఈ బ్యూటి, ఇటీవల సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ వస్తుంది. తాజాగా దృశ్యం బాలీవుడ్ రీమేక్లో తనదైన నటనతో మెప్పించిన టబు మరో ఇంట్రస్టింగ్ సినిమాతో సౌత్ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది.

అనుష్క లీడ్ రోల్లో పిల్ల జమీందార్ ఫేం అశోక్ తెరకెక్కిస్తున్న సినిమా భాగమతి. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్కతో పాటు మరో కీలక పాత్రలో టబు నటించనుందట. ఈ సినిమాలో టబు, అనుష్క తల్లిగా నటిస్తుందన్న టాక్ వినిపిస్తున్నా.. యూనిట్ సభ్యుల నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement