అనుష్క జోడిగా మళయాల స్టార్ | Malayala Hero Unni Mukundan in Anushka Bhagmathi | Sakshi
Sakshi News home page

అనుష్క జోడిగా మళయాల స్టార్

Published Thu, Jul 21 2016 10:52 AM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

అనుష్క జోడిగా మళయాల స్టార్

అనుష్క జోడిగా మళయాల స్టార్

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో చేతినిండా సినిమాలతో యమా బిజీగా ఉన్న హీరోయిన్ అనుష్క. బాహుబలి పార్ట్ 2తో పాటు సింగం సిరీస్లో వస్తున్న ఎస్ 3 సినిమాలలో నటిస్తున్న ఈ బ్యూటి, మరో లేడి ఓరియంటెడ్ సినిమాకు రెడీ అవుతోంది. పిల్లజమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థ్రిల్లర్ సినిమాలో ప్రధాన పాత్రలోనటిస్తోంది.

భాగమతి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్క సరసన హీరోగా మళయాల స్టార్ ఉన్ని ముకుందన్ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ సినిమాలో విలన్గా నటిస్తున్న ముకుందన్, మరోసారి తెలుగు సినిమాలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement