నా ప్రతాపరుద్రుడుకు మంచి నిర్మాత దొరికాడు : గుణశేఖర్
‘రుద్రమదేవి’ చిత్రం తెలుగువారు మరోసారి గర్వంగా తలెత్తుకునేలా చేసిందని యూనిట్ సభ్యులు సంతోషం వెలిబుచ్చారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘రుద్రమదేవి’ సక్సెస్‌మీట్‌లో ఎవరెవరు ఏం మాట్లాడారంటే...
ప్రకాశ్‌రాజ్: తెలుగు సినిమా కీర్తిని ఎక్కడికో తీసుకెళ్లిన గుణశేఖర్‌కి హ్యాట్సాఫ్. గోనగన్నారెడ్డి పాత్రకు అల్లు అర్జున్ కరెక్ట్ ఛాయిస్.
కృష్ణంరాజు: 28 ఏళ్ల క్రితం మేం ‘తాండ్ర పాపారాయుడు’ తీశాం. అలా ఇంకెవరూ తీయలేరనుకున్నాం. గుణశేఖర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. గోనగన్నారెడ్డి పాత్ర చేయాలని ఎన్టీఆర్, నేనూ అనుకున్నాం. చివరికి అదృష్టం అల్లు అర్జున్‌కు దక్కింది.
అల్లు అర్జున్: ఈ సినిమాకు నిజమైన హీరో అనుష్క. నా కష్టం 30 రోజులే. కానీ ఆమె కష్టం మూడేళ్లు. అనుష్క లేకపోతే ఈ ‘రుద్రమదేవి’ లేదు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి: గుణ టీమ్ మహాయుద్ధం చేసింది. ఆ యుద్ధ విజయమే ఈ దసరా. మూడు దశాబ్దాలు సాగిన పోరాటాన్ని మూడు గంటల్లో ఎలా చూపిస్తారో అనుకున్నా. ఇక నుంచి గుణశేఖర్‌ని ‘సాహస గుణశేఖర్’ అని పిలవాలి.
అనుష్క: ఈ సినమా కోసం టీమ్‌తో పాటు గుణశేఖర్‌గారి కుటుంబం ఎంత కష్టపడిందో నాకు తెలుసు. రచయిత తోటప్రసాద్‌గారు లొకే షన్‌లో రోజూ నాతో పాటు ఉండి డైలాగులు ఎక్స్‌ప్లెయిన్ చేసేవారు. ఇలా అందరి కష్టానికి మంచి ఫలితం దక్కింది. ఇది నాకు లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ కింద లెక్క.
పరుచూరి వెంకటేశ్వరరావు: తెలంగాణాలో పన్ను రాయితీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌గారికి మా ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా పన్ను రాయితీ ఇస్తారనే ఆశిస్తున్నాం.
తోట ప్రసాద్: 84 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ హిస్టారికల్ ఫిల్మ్ ఇదే. 2002 నుంచి ఈ కథకు సంబంధించి గుణశేఖర్‌గారితో ట్రావెల్ అవుతున్నా.
‘దిల్’ రాజు: 2009లో ‘అరుంధతి’, ‘మగధీర’ వచ్చి అందర్నీ అబ్బురపరిచాయి. 2015లో ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ వచ్చి తెలుగు సినిమా తలెత్తుకునేలా చేశాయి. గుణశేఖర్ ‘ప్రతాపరుద్రుడు’ కథ రెడీ చేస్తే... నేను నిర్మిస్తాను.
గుణశేఖర్: మొత్తానికి ‘ప్రతాపరుద్రుడు’ సినిమాకు మంచి నిర్మాత దొరికాడు. ఈ సినిమా విషయంలో అందరూ నాకు వెన్నుదన్నుగా నిలబడ్డారు. అల్లు అర్జున్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే అనుష్కకు కూడా. నాలాంటి ఒక సామాన్యుడు ఇలాంటి సినిమా తీయడమా? (అంటూ ఉద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు).