న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో ఇన్నాళ్లూ బిజీగా ఉన్న అన్ని పార్టీల వాలంటీర్లు, కార్యకర్తలు ఆదివారం విశ్రాంతిగా గడిపారు. కొన్ని వారాలుగా ఎంతో కచ్చితమైన విధానాలను అనుసరించిన వాలంటీర్లకు అన్ని పార్టీలు కృతజ్ఞతలు చెప్పా యి. రికార్డు స్థాయిలో 67 శాతం పోలింగ్ నమోదైన ఢిల్లీలో ఆప్ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధిస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆది వారం ఆలస్యంగా నిద్రలేచి ఉత్సాహంగా గడిపారు. ‘ప్రచారంలో పాల్గొన్నప్పుడు ప్రతి రోజూ మా దినచర్య వేకువజాము నుంచే ప్రారంభమయ్యేది. ఇప్పుడు నా శక్తిని క్రమపద్ధతిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక జిమ్‌కు వెళ్తాను’ అని ఆప్ తరఫున ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న సందీప్ అనే కార్యకర్త చెప్పాడు. ‘ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ ఆదివారాన్ని కుటుంబంతో గడిపి, సినిమాకు వెళ్లమని మమ్మల్ని కోరారు. నేను అదే పని చేశాను’ అని పశ్చిమ ఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతానికి చెందిన ఏకే త్యాగి అనే వాలంటీర్ తెలిపాడు.
‘మా ప్రాంతంలో యువత మద్దతును కూడగట్టే బాధ్యత నాది. నెల రోజులుగా ప్రతి దినం ఎన్నో సమావేశాలను ఏర్పాటు చేశాం. ఈ రోజు నా సమయాన్నం తా స్నేహితులతో గడిపి, ఎన్నికల ఫలితాలపై చర్చించా’ అని ముండ్కాకు చెందిన దినేశ్ కుమార్ చెప్పాడు. ‘చాలా రోజుల తర్వాత నేను ప్రశాంతంగా నిద్రపోయాను. ఈ రోజు ఎలాంటి సమావేశాలూ లేవు. సాయంత్రం రెండు పెళ్లి వేడుకల్లో కుటుంబంతో కలసి పాల్గొన్నా’ అని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధికార ప్రతినిధి ముఖేశ్ శర్మ పేర్కొన్నారు. ‘ఈ రోజు నేను ఇంటికి సమీపంలోని గుడికి వెళ్లి మా పార్టీ గెలవాలని ప్రార్థించా. ఈ రోజు ఎలాంటి అధికారిక కార్యక్రమమూ లేదు’ అని ఉత్తమ్‌నగర్‌కు చెందని శిరీష్ చౌహన్ చెప్పాడు. ‘ఎన్నికల ప్రచార సామగ్రిని సరిచూసుకోవాల్సిన అవసరం ఇక లేదు. కిరణ్ బేడీ గెలుపుకోసం మేం చేయాల్సిందంతా చేశాం.
ఇది పరీక్షలు అయిపోయిన తర్వాతి పరిస్థితిలా ఉంది’ అని జంగ్‌పురకు చెందిన తాహిర్ అబ్బాస్ అనే బీజేపీ వాలంటీర్ అభిప్రాయపడ్డారు. అయితే బీజేపీ ప్రముఖ నాయకులు మొత్తం 70 మంది అభ్యర్థులతో పాటు బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ సమావేశమయ్యారు. ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇందులో చర్చించారు. పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లు మాత్రం ఉత్సాహంగా గడిపారు.ఈ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. 15 నెలల కాలం లో ఢిల్లీ ఓటర్లు మరోసారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నాడు. 70 విధానసభ స్థానాల్లో 673 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత లోక్‌సభ ఎన్నికలు, హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలను పునరావృతం చేయాలని బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా కృషి చేశారు. గత ఎన్నికల్లో తృటిలో సంపూర్ణ మెజారిటీని కోల్పోయిన ఆప్ ఈ సారి ఎలాగైనానా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేసింది. ఈ ఎన్నికల్లోనైనా కొన్ని స్థానాలు గె లుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.
చాన్నాళ్ల తర్వాత చాలా తీరిగ్గా...
Published Sun, Feb 8 2015 10:20 PM | Last Updated on Mon, Dec 3 2018 1:54 PM
Advertisement
Advertisement