Delhi election 2015
-
ఢిల్లీ ఫలితాలపై ఉత్కంఠ
-
ఆల్ ది బెస్ట్ డిలైట్స్. అందరూ గెలవాలి
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఢిల్లీ పీఠాన్ని అధిష్టించేందుకు బరిలో ఉన్న సీఎం అభ్యర్ధులు ఏమంటున్నారో ఓసారి చూద్దాం.. కేజ్రీవాల్: ఆల్ ది బెస్ట్ డిలైట్స్. అందరూ గెలవాలని ప్రార్థిద్దాం. శనివారం వెలువడిన ఎగ్జిట్ పోల్ లో ఆప్ ఢిల్లీలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తేలింది. ఆ విధంగానే ఆప్ కూడా ధీమాగా ఉంది. ఆప్ 45 నుంచి 50 సీట్ల దాకా గెలుస్తుందని పార్టీ కార్యకర్తలు ధీమాగా ఉన్నారని ఆప్ నేత జగదీప్ సింగ్ అన్నారు. కిరణ్ బేడీ: బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ తన ఇంటి బయట ఉండి ట్వీట్ చేశారు. జగదీశ్ ముఖి (బీజేపీ) మాట్లాడుతూ.. తప్పకుండా మా పార్టీయే గెలుస్తుందనే నమ్మకం ఉంది. అతి పెద్ద మెజారిటీతో అధికారంలోకి వస్తాం. 35 సీట్లకు పైగా గెలిచి మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
విధానసభఎన్నికల్లో 67.14 శాతం పోలింగ్
రాష్ట్ర చరిత్రలోనే అత్యధికం న్యూఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం.. శనివారం జరిగిన ఎన్నికల్లో 67.14 శాతం పోలింగ్ నమోదైంది. శనివారం సాయంత్రానికి 67.08 శాతం నమోదుకాగా, పోలింగ్ పూర్తిగా ముగిసే నాటికి కొంచెం పెరిగి 67.14 శాతానికి చేరింది. రాజ్యాంగ సవరణ ప్రకారం 1993లో విధానసభ పునఃస్థాపన గావించిన తర్వాత ఈ స్థాయిలో పోలింగ్ శాతం నమోదుకావడం ఇదే తొలిసారి. 2013 నాటి ఎన్నికల్లో 66 శాతం మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధికార పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని ఎగ్జిట్ -
గెలిచే హక్కు ఆప్కే ఉంది
న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల్లో గెలిచే హక్కు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కే ఉందని అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ షో ‘బాలికా వధు’లో కీలకపాత్రధారిణి అయిన నటి స్మితా బన్సల్ అభిప్రాయపడింది. ఇందుకు కారణం సమాజంలోని అన్ని సామాజిక అంశాలపై పోరాడే ధైర్యం ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఉండడమేనన్నారు. ఢిల్లీ విధానసభ ఎన్నికలపై వచ్చిన ఎగ్జిట్ పోల్స్‌పై ఆదివారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘ఇది పూర్తిగా నగరవాసుల తీర్పు. ఏదిఏమయినప్పటికీ ఆప్కే నా మద్దతు. ఎన్నికల ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం ఆప్కే అనుకూలంగా వచ్చాయి. భవిష్యత్తుకు ఇది ఎంతో మంచిది’అని ఆమె పేర్కొన్నారు. ఆప్కే ఎందుకు మద్దతు పలకాలని నిర్ణయించుకున్నారని అడగ్గా... ఇవ్వగలిగిన సత్తా అరవింద్‌కే ఉంది. ఇచ్చిన వాగ్దానాలను ఆయన మాత్రమే నిలబెట్టుకోగలుగుతారు. ఆయన నగరవాసులకు ఏదైనా మాట ఇచ్చాడంటే దానిని నిలబెట్టుకుంటారు. ఎన్నికల సందర్బంగా ఆప్ విడుదల చేసిన మేనిఫెస్టోలోని అన్ని హామీలు కార్యరూపం దాలుస్తాయి. ఆప్... ప్రజల పార్టీ. దేశానికి అవసరమైన మార్పునకు ఆప్ సంకేతం. మహిళా భద్రత, అవినీతి పెద్దపెద్ద అంశాలకు సంబంధించి ఆ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది. సామాన్యుడికి ఏది అవసరమో ఆ పార్టీకి తెలుసు’అని అన్నారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా...
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా హంగామా సృష్టించిన రాష్ట్ర విధానసభ ఎన్నికలు శనివారం ముగియడంతో అన్ని పార్టీల అభ్యర్థులు తమ విశ్రాంతి సమయాన్ని ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. కొంత మంది అభ్యర్థులు తమ కుటుంబసభ్యులతో, పెంపుడు జంతువులతో గడపగా, మరి కొంతమంది తమ నియోజకవర్గ ప్రజలతో సమావేశమయ్యారు. ప్రశాంతంగా గడుపుతున్నా: శర్మిష్టా ముఖర్జీ ‘ఎన్నికల ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచించదలచుకోలేదు. ప్రస్తుతం నా ఆలోచనల్లో ఆ అంశానిది చివరి స్థానం. నా విశ్రాంత సమయాన్ని పెంపుడు కుక్కతో ఆడుకుంటూ ప్రశాంతంగా గడుపుతున్నా. అంతేగాక నా ఇల్లు మొత్తం ఎన్నికల హడావుడితో చిందరవందరగా తయారైంది. దానిని శుభ్రం చేసి మళ్లీ పూర్వ స్థాయిని తీసుకురావాలి. సాయంత్ర సమయంలో నా తల్లిదండ్రుల వద్దకు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి కొంతసేపు గడిపి వస్తున్నా. నా బాధ్యతను పూర్తిగా నెరవేర్చా. ప్రస్తుతం నా భవిష్యత్తు ప్రజల చేతిలో ఉంది’అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె, గ్రేటర్ కైలాశ్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి శర్మిష్టా ముఖర్జీ పేర్కొన్నారు. ప్రచార విశేషాలకు పుస్తక రూపం: నూపుర్ శర్మ ‘మా నాన్న ఈ రోజు జర్మనీ వెళుతున్నారు. ఆ తర్వాత నాకు విశ్రాంతి లభిస్తుందేమో! మాది ఉమ్మడి కుటుంబం, వారి మధ్యలో ఉండటాన్ని నేను ఎక్కువగా ఇష్టపడతా. నాకు రాయడం ఇష్టం, అందుకే ప్రచార విశేషాలను రాయాలనుకుంటున్నాను. ప్రస్తుతం టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొనదలుచుకోలేదు. అయినా ఎన్నికల ఫలితాల గురించి నేను ఆతృతగా లేను. నా ఆధీనంలో లేని దాని గురించి నేనెందుకు బాధపడాలి. నేను ఒక ఆశయంతో బాధ్యతగా రాజకీయాల్లోకి వచ్చాను. గత ఏడేళ్లలో కొంత వరకు నా బాధ్యతను నెరవేర్చాను. ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మదలచుకోలేదు, ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకంతో ఉన్నాం’అని బీజేపీ అభ్యర్థి నూపుర్ శర్మ పేర్కొన్నారు. ఈ 29 ఏళ్ల రాజకీయ నాయకురాలు తన విశ్రాంత సమయాన్ని కూడా కార్యకర్తలకే కేటాయించారు. పోలింగ్ తర్వాతి పరిణామాలపై వారితో చర్చించారు. చాలినంత నిద్ర పోయా: రాఖీ బిర్లా ‘ఇన్ని రోజులు ప్రచారంలో తీరిక లేకుండా గడపడం వల్ల చాలినంత నిద్రను కోల్పోయాను. దీంతో నేను ఈ రోజు ఉదయం 10 గంటలకు నిద్ర లేచాను. ఫలితాల గురించి ఆతృతగా లేను. ఇవి ప్రజల ఎన్నికలు, చాలా మంది పోటీ పడితే అందులోంచి వాళ్లు ఒకరిని మాత్రమే గెలిపిస్తారు. అందువల్ల నేను బాధపడాల్సిన అవసరం లేదు. దాని బదులు నేను నా నియోజకవర్గ మహిళలతో మాట్లాడుతూ వారి సమస్యలు వింటూ గడుపుతున్నాను’ అని మంగోల్‌పురి నియోజకవర్గ ఆప్ అభ్యర్థి రాఖీ బిర్లా తెలిపారు. -
చాన్నాళ్ల తర్వాత చాలా తీరిగ్గా...
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో ఇన్నాళ్లూ బిజీగా ఉన్న అన్ని పార్టీల వాలంటీర్లు, కార్యకర్తలు ఆదివారం విశ్రాంతిగా గడిపారు. కొన్ని వారాలుగా ఎంతో కచ్చితమైన విధానాలను అనుసరించిన వాలంటీర్లకు అన్ని పార్టీలు కృతజ్ఞతలు చెప్పా యి. రికార్డు స్థాయిలో 67 శాతం పోలింగ్ నమోదైన ఢిల్లీలో ఆప్ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధిస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆది వారం ఆలస్యంగా నిద్రలేచి ఉత్సాహంగా గడిపారు. ‘ప్రచారంలో పాల్గొన్నప్పుడు ప్రతి రోజూ మా దినచర్య వేకువజాము నుంచే ప్రారంభమయ్యేది. ఇప్పుడు నా శక్తిని క్రమపద్ధతిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక జిమ్‌కు వెళ్తాను’ అని ఆప్ తరఫున ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న సందీప్ అనే కార్యకర్త చెప్పాడు. ‘ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ ఆదివారాన్ని కుటుంబంతో గడిపి, సినిమాకు వెళ్లమని మమ్మల్ని కోరారు. నేను అదే పని చేశాను’ అని పశ్చిమ ఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతానికి చెందిన ఏకే త్యాగి అనే వాలంటీర్ తెలిపాడు. ‘మా ప్రాంతంలో యువత మద్దతును కూడగట్టే బాధ్యత నాది. నెల రోజులుగా ప్రతి దినం ఎన్నో సమావేశాలను ఏర్పాటు చేశాం. ఈ రోజు నా సమయాన్నం తా స్నేహితులతో గడిపి, ఎన్నికల ఫలితాలపై చర్చించా’ అని ముండ్కాకు చెందిన దినేశ్ కుమార్ చెప్పాడు. ‘చాలా రోజుల తర్వాత నేను ప్రశాంతంగా నిద్రపోయాను. ఈ రోజు ఎలాంటి సమావేశాలూ లేవు. సాయంత్రం రెండు పెళ్లి వేడుకల్లో కుటుంబంతో కలసి పాల్గొన్నా’ అని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధికార ప్రతినిధి ముఖేశ్ శర్మ పేర్కొన్నారు. ‘ఈ రోజు నేను ఇంటికి సమీపంలోని గుడికి వెళ్లి మా పార్టీ గెలవాలని ప్రార్థించా. ఈ రోజు ఎలాంటి అధికారిక కార్యక్రమమూ లేదు’ అని ఉత్తమ్‌నగర్‌కు చెందని శిరీష్ చౌహన్ చెప్పాడు. ‘ఎన్నికల ప్రచార సామగ్రిని సరిచూసుకోవాల్సిన అవసరం ఇక లేదు. కిరణ్ బేడీ గెలుపుకోసం మేం చేయాల్సిందంతా చేశాం. ఇది పరీక్షలు అయిపోయిన తర్వాతి పరిస్థితిలా ఉంది’ అని జంగ్పురకు చెందిన తాహిర్ అబ్బాస్ అనే బీజేపీ వాలంటీర్ అభిప్రాయపడ్డారు. అయితే బీజేపీ ప్రముఖ నాయకులు మొత్తం 70 మంది అభ్యర్థులతో పాటు బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ సమావేశమయ్యారు. ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇందులో చర్చించారు. పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లు మాత్రం ఉత్సాహంగా గడిపారు.ఈ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. 15 నెలల కాలం లో ఢిల్లీ ఓటర్లు మరోసారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నాడు. 70 విధానసభ స్థానాల్లో 673 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత లోక్‌సభ ఎన్నికలు, హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలను పునరావృతం చేయాలని బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా కృషి చేశారు. గత ఎన్నికల్లో తృటిలో సంపూర్ణ మెజారిటీని కోల్పోయిన ఆప్ ఈ సారి ఎలాగైనానా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేసింది. ఈ ఎన్నికల్లోనైనా కొన్ని స్థానాలు గె లుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.