ఆల్ ది బెస్ట్ డిలైట్స్. అందరూ గెలవాలి
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఢిల్లీ పీఠాన్ని అధిష్టించేందుకు బరిలో ఉన్న సీఎం అభ్యర్ధులు ఏమంటున్నారో ఓసారి చూద్దాం..
కేజ్రీవాల్: ఆల్ ది బెస్ట్ డిలైట్స్. అందరూ గెలవాలని ప్రార్థిద్దాం.
శనివారం వెలువడిన ఎగ్జిట్ పోల్ లో ఆప్ ఢిల్లీలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తేలింది. ఆ విధంగానే ఆప్ కూడా ధీమాగా ఉంది. ఆప్ 45 నుంచి 50 సీట్ల దాకా గెలుస్తుందని పార్టీ కార్యకర్తలు ధీమాగా ఉన్నారని ఆప్ నేత జగదీప్ సింగ్ అన్నారు.
కిరణ్ బేడీ: బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ తన ఇంటి బయట ఉండి ట్వీట్ చేశారు.
జగదీశ్ ముఖి (బీజేపీ) మాట్లాడుతూ.. తప్పకుండా మా పార్టీయే గెలుస్తుందనే నమ్మకం ఉంది. అతి పెద్ద మెజారిటీతో అధికారంలోకి వస్తాం. 35 సీట్లకు పైగా గెలిచి మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.