
ప్రేమించడం ఎంత సులువో ఆ ప్రేమను దక్కించుకోవడం అంత కష్టం. ఇష్టపడిన ప్రేయసికి లవ్ ప్రపోజ్ చేయడం దగ్గర నుంచి తనను ఒప్పించేలా ప్రేమను వ్యక్త పరచాలంటే ఎన్నో పాట్లు పడాలి. ఈ ప్రక్రియలో ఎంతో మంది తమకు నచ్చిన విధంగా ప్రపోజ్ చేస్తుంటారు. పువ్వు ఇచ్చి, లెటర్ రాసి, మెసెజ్‌ల రూపంలో ఇలా రకరకాలుగా తమ ప్రేమను వ్యక్త పరుస్తుంటారు. ప్రతి అబ్బాయి ఎవరైనా తన లవర్‌కు ప్రత్యేకంగా ప్రపోజ్ చేయాలి అనుకుంటాడు. అయితే ఇందుకు ప్లానింగ్ కూడా ఎంతో ముఖ్యం. ప్లానింగ్ మిస్సయితే.. సిక్సర్ కాస్తా.. ఔట్‌గా మారే ప్రమాదం ఉంది. (పార్లమెంట్‌లోనే ప్రేయసికి ప్రపోజ్ చేశాడు)
అచ్చం ఇలాంటి ఓ సంఘటనే లండన్‌లో చోటుచేసుకుంది. షెఫీల్డ్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు కొంత కాలంగా తన స్నేహితురాలిని ప్రేమిస్తున్నాడు. ఓ మంచి రోజు చూసుకొని తన గర్ల్‌ఫ్రెండ్‌కు లవ్ ప్రపోజ్ చేయాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో తన నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో వందలాది క్యాండిల్స్‌ను వెలిగించాడు. బెలూన్స్ డెకరేట్ చేసి, గ్లాస్‌లలో వైన్ పోసి ఉంచాడు. ఇక తన స్నేహితురాలిని ఇంటికి తీసుకొచ్చేందుకు వెళ్లి తిరిగి అపార్ట్‌మెంట్‌కు చేరుకునే సరికి ప్రమాదవశాత్తు ఇల్లంతా మంటలు అలుముకున్నాయి. మూడు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకు వస్తున్నాయి. వెంటనే షాక్ నుంచి తేరుకున్న యువకుడు కొవ్వొత్తుల కారణంగా ఇంట్లో మంటలు వ్యాపించాయని ఊహించాడు. (నాకో ప్రేయసి కావాలి...జపాన్ కుబేరుడు)
అయినప్పటికీ మంటలు అదుపులోకి వచ్చాక మంటల్లో కాలిపోయిన ఇంట్లోనే తన గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేశాడు. ఇంత జరిగాక యువతి నో చెప్పే అవకాశమే లేదు. యువకుడి ప్రేమను అంగీకరించింది. కాగా అగ్నిమాపక సిబ్బంది విభాగం ఈ దృశ్యాలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ‘ప్రేమ ఎంత ప్రమాదకరమైనదో మరోసారి రుజువైంది. తక్కువ బడ్జెట్‌లో ప్రపోజ్ చేద్దామనుకున్నాడు. కానీ ఇప్పుడు ఇంటిని పునర్నిర్మించేందుకు భారీ బడ్జెట్ కావాలి’. అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment