బర్త్‌డేలను సెలబ్రేట్ చేసుకోవడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు.. చిన్నాపెద్దా తేడా లేకుండా తమ స్థాయిని బట్టి స్పెషల్ వేడుకలను జరుపుకుంటారు. పుట్టినరోజు నాడు అందరూ కామన్‌గా చేసేది.. క్యాండిల్స్ ఊది కేక్ కట్ చేయడం. అసలు బర్త్‌డేలకు కేక్ ఎందుకు కట్ చేస్తారు? క్యాండిల్ ఊదడం వెనుక కారణాలు ఏంటి? అసలు ఈ కల్చర్ ఎక్కడినుంచి వచ్చింది అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
బర్త్‌డేలకు క్యాండిల్స్ ఊది, కేక్ కట్ చేయడం అన్న సంప్రదాయం ఇప్పటిది కాదు. 1808వ సంవత్సరంలోనే ఇది ప్రారంభమైందని చెబుతారు. జర్మనీలో అప్పట్లో కిండర్‌ఫెస్ట్ పేరిట కేవలం పిల్లలకు మాత్రమే బర్త్ డే వేడుకలను నిర్వహించేవారట. మనం కట్ చేసే సుతిమెత్తని మృదువైన కేకులా మన జీవితం కూడా సాఫీగా సాగాలని నమ్ముతారు. అందుకే స్పెషల్ వేడుకల్లో కేక్‌ను కట్ చేస్తారు. ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే ఈ కల్చర్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. ఇక క్యాండిల్స్ ఊదే సంప్రదాయం మాత్రం గ్రీకుల కాలం నుంచి వచ్చిందని అంటారు.
గ్రీకు దేవత ఆర్టెమిను ఆరాధించడం కోసం కొవ్వొత్తులను వెలిగించేవారట.ఆమెను పూజించేటప్పుడు గుండ్రని కేకుపై క్యాండిల్స్ వెలిగించేవారట. ఆ వెలుగు చంద్రుని ప్రకాశానికి ప్రతీకగా భావించేవారట. క్యాండిల్స్ ఊదడం వల్ల వచ్చే పొగను గ్రీకులు పవిత్రంగా భావించేవారట. అందుకే క్యాండిల్ ఊదేటప్పుడు మేక్ ఏ విష్ అంటారు.
అంటే మనం అనుకున్నది నెరవేరాలని మనస్పూర్థిగా ప్రార్థించడం. క్యాండిల్ పొగ దేవతను చేరుతుందని, అలా తమ కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అలా అప్పటి నుంచి ఈ కల్చర్‌ను అందరూ ఫాలో అవుతున్నారు. ఇదీ బర్త్‌డే నాడు క్యాండిల్స్ ఊదడం వెనకున్న కథ.
Comments
Please login to add a commentAdd a comment