birthday candles
-
బర్త్‌డే నాడు క్యాండిల్స్ ఎందుకు ఊదుతారు? దాని వెనకున్న కథేంటి?
బర్త్‌డేలను సెలబ్రేట్ చేసుకోవడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు.. చిన్నాపెద్దా తేడా లేకుండా తమ స్థాయిని బట్టి స్పెషల్ వేడుకలను జరుపుకుంటారు. పుట్టినరోజు నాడు అందరూ కామన్‌గా చేసేది.. క్యాండిల్స్ ఊది కేక్ కట్ చేయడం. అసలు బర్త్‌డేలకు కేక్ ఎందుకు కట్ చేస్తారు? క్యాండిల్ ఊదడం వెనుక కారణాలు ఏంటి? అసలు ఈ కల్చర్ ఎక్కడినుంచి వచ్చింది అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.. బర్త్‌డేలకు క్యాండిల్స్ ఊది, కేక్ కట్ చేయడం అన్న సంప్రదాయం ఇప్పటిది కాదు. 1808వ సంవత్సరంలోనే ఇది ప్రారంభమైందని చెబుతారు. జర్మనీలో అప్పట్లో కిండర్‌ఫెస్ట్ పేరిట కేవలం పిల్లలకు మాత్రమే బర్త్ డే వేడుకలను నిర్వహించేవారట. మనం కట్ చేసే సుతిమెత్తని మృదువైన కేకులా మన జీవితం కూడా సాఫీగా సాగాలని నమ్ముతారు. అందుకే స్పెషల్ వేడుకల్లో కేక్‌ను కట్ చేస్తారు. ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే ఈ కల్చర్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. ఇక క్యాండిల్స్ ఊదే సంప్రదాయం మాత్రం గ్రీకుల కాలం నుంచి వచ్చిందని అంటారు. గ్రీకు దేవత ఆర్టెమిను ఆరాధించడం కోసం కొవ్వొత్తులను వెలిగించేవారట.ఆమెను పూజించేటప్పుడు గుండ్రని కేకుపై క్యాండిల్స్ వెలిగించేవారట. ఆ వెలుగు చంద్రుని ప్రకాశానికి ప్రతీకగా భావించేవారట. క్యాండిల్స్ ఊదడం వల్ల వచ్చే పొగను గ్రీకులు పవిత్రంగా భావించేవారట. అందుకే క్యాండిల్ ఊదేటప్పుడు మేక్ ఏ విష్ అంటారు. అంటే మనం అనుకున్నది నెరవేరాలని మనస్పూర్థిగా ప్రార్థించడం. క్యాండిల్ పొగ దేవతను చేరుతుందని, అలా తమ కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అలా అప్పటి నుంచి ఈ కల్చర్‌ను అందరూ ఫాలో అవుతున్నారు. ఇదీ బర్త్‌డే నాడు క్యాండిల్స్ ఊదడం వెనకున్న కథ. -
నటి పుట్టినరోజు వేడుకల్లో అపశ్రుతి... కొంచెమైతే ఏమయ్యేదో..
మన నిత్య జీవితంలో చేసే చిన్న చిన్న పొరబాట్లు పెద్ద పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయి. ఐతే ఆ టైంలో కొంచెం చురుకుగా వ్యవహరిస్తే పెనుప్రమాదం సంభవించకుండా నివారించవచ్చు. తాజాగా ఒక అమెరికా నటి పుట్టినరోజు వేడుకల్లో అటువంటి అపశ్రుతే చోటుచేసుకుంది. అయితే ఆమె సమయానికి స్పందించడంతో ప్రమాదం తప్పింది. అసలేంజరిగిందంటే.. ‘ది సింపుల్ లైఫ్’ టెలివిజన్ సిరీస్‌లో నటించిన ప్రముఖ అమెరికన్ రియాలిటీ స్టార్ నికోల్ రిచీ తన 40వ పుట్టినరోజు వేడుకలను సెప్టెంబర్ 21న జరుపుకున్నారు. అయితే పుట్టిన రోజునాడు స్నేహితులతోపాటు కేక్ ముందు కూర్చుని కొవ్వొత్తులను నోటితో ఊది ఆర్పే టైంలో అనుకోకుండా ఆమె తలవెంట్రుకలకు రెండు వైపులా నిప్పు అంటుకుంది. ఆమెకు ఎడమవైపున కూర్చున్నవారు వెంటనే తేరుకుని మంటలను ఆర్పేశారు. అయితే కుడి వైపున మాత్రం మంటలు చెలరేగాయి. ఆమె పెద్దగా అరుస్తూ తన చేతులతో ఆ మంటలను ఆర్పేశారు. కాగా ఈ వేడుకలకు కుటుంబ సభ్యులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఐతే ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. దీనికి సంబంధించిన వీడియోను నికోస్ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ‘వెల్ సోఫార్ 40 ఈజ్ (ఫైర్ ఎమోజీ)’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో హ్యాపీ బర్త్‌డే కుజ్, మీరు బాగున్నారా? అని స్నేహితులు, అభిమానుల నుంచి వేలల్లో కామెంట్స్ రూపంలో కుశల ప్రశ్నల వర్షం కురిపించారు. లక్షల మంది ఈ వీడియోను ఆసక్తిగా వీక్షించడంతో సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. చదవండి: Typhoid Diet: టైఫాయిడ్ టైంలో ఇవి తినడం చాలా ప్రమాదకరం.. మరేం తినాలి?! -
బర్త్‌డే క్యాండిల్స్‌తో గిన్నిస్ రికార్డు!
-
బర్త్‌డే క్యాండిల్స్‌తో గిన్నిస్ రికార్డు!
బర్త్‌డే కేక్ మీద ఎన్ని క్యాండిల్స్ వెలిగిస్తారు... సాధారణంగా అయితే పుట్టినరోజును బట్టి ఒకటి నుంచి పది వరకు అయితే అన్ని క్యాండిల్స్, ఆ తర్వాత అయితే ఆ అంకె ఆకారంలో ఉన్నవి వెలిగిస్తారు. కానీ, అమెరికాలో ఒక ఆధ్యాత్మిక గురువు జయంతి సందర్భంగా ఏకంగా 72వేలకు పైగా క్యాండిల్స్ వెలిగించి గిన్నిస్ రికార్డు సృష్టించారు. స్వామి చిన్మయ కిషోర్ ఘోష్ 85వ జయంతి సందర్భంగా న్యూయార్క్‌లో ఈ వినూత్న ప్రక్రియ చేపట్టారు. 1964లోనే న్యూయార్క్ నగరానికి వెళ్లిపోయిన స్వామి చిన్మయ.. అక్కడ పాశ్చాత్యులకు ధ్యానం నేర్పించారు. ఆయన శిష్యులు ఇప్పటికీ అమెరికా సహా పలు దేశాల్లో ఉన్నారు. తాజాగా ఆయన 85వ జయంతి సందర్భంగా వంద మంది కలిసి న్యూయార్క్ నగరంలోని శ్రీ చిన్మయ సెంటర్లో ఓ భారీ కేకును ఏర్పాటుచేశారు. మొత్తం 72,585 క్యాండిల్స్ సిద్ధం చేసి, ప్రతి క్యాండిల్‌ను ఆ భారీ కేకు మీద ఉంచి, 60 బ్లోటార్చిల సహాయంతో వాటిని వెలిగించారు. వెలిగిన తర్వాత చూస్తే... అది ఏదో పెద్ద హోమంలా అనిపించింది. 40 సెకండ్ల పాటు ఆ క్యాండిల్స్ వెలుగుతూనే ఉన్నాయి. తర్వాత వాటిని అగ్నిమాపక పరికరాలతో ఆర్పాల్సి వచ్చింది. సాధారణంగా అయితే నోటితో ఊది క్యాండిల్స్ ఆర్పుతారు గానీ, ఇక్కడ మంటలు చాలా పెద్దస్థాయిలో ఉండటంతో అది సాధ్యం కాక కార్బన్ డయాక్సైడ్ సిలిండర్లతో ఆర్పారు. తర్వాత కేకు మీద పడిన మైనం మొత్తాన్ని జాగ్రత్తగా దాని మీద నుంచి తుడిచేశారు. ఆ తర్వాత కేకును పంచిపెట్టారు. ఇంతకుముందు కాలిఫోర్నియాలో మైక్ హార్డ్ లెమనేడ్ పేరుమీద అత్యధిక క్యాండిల్స్ వెలిగించిన రికార్డు ఉంది. అప్పుడు 50,151 క్యాండిల్స్ వెలిగించారు.