బర్త్‌డే క్యాండిల్స్‌తో గిన్నిస్ రికార్డు! | guinnes record with most number of birthday candles | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 7 2016 2:19 PM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM

బర్త్‌డే కేక్ మీద ఎన్ని క్యాండిల్స్ వెలిగిస్తారు... సాధారణంగా అయితే పుట్టినరోజును బట్టి ఒకటి నుంచి పది వరకు అయితే అన్ని క్యాండిల్స్, ఆ తర్వాత అయితే ఆ అంకె ఆకారంలో ఉన్నవి వెలిగిస్తారు. కానీ, అమెరికాలో ఒక ఆధ్యాత్మిక గురువు జయంతి సందర్భంగా ఏకంగా 72వేలకు పైగా క్యాండిల్స్ వెలిగించి గిన్నిస్ రికార్డు సృష్టించారు. స్వామి చిన్మయ కిషోర్ ఘోష్ 85వ జయంతి సందర్భంగా న్యూయార్క్‌లో ఈ వినూత్న ప్రక్రియ చేపట్టారు. 1964లోనే న్యూయార్క్ నగరానికి వెళ్లిపోయిన స్వామి చిన్మయ.. అక్కడ పాశ్చాత్యులకు ధ్యానం నేర్పించారు. ఆయన శిష్యులు ఇప్పటికీ అమెరికా సహా పలు దేశాల్లో ఉన్నారు. తాజాగా ఆయన 85వ జయంతి సందర్భంగా వంద మంది కలిసి న్యూయార్క్‌ నగరంలోని శ్రీ చిన్మయ సెంటర్‌లో ఓ భారీ కేకును ఏర్పాటుచేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement