‘ఆరెంజ్‌ పాస్‌పోర్ట్‌’.. బీజేపీ వివక్షే: రాహుల్‌ | Orange passports proposal shows BJP's discriminatory mindset | Sakshi
Sakshi News home page

‘ఆరెంజ్‌ పాస్‌పోర్ట్‌’.. బీజేపీ వివక్షే: రాహుల్‌

Published Mon, Jan 15 2018 4:17 AM | Last Updated on Mon, Jan 15 2018 4:17 AM

Orange passports proposal shows BJP's discriminatory mindset - Sakshi

న్యూఢిల్లీ: ఇమిగ్రేషన్‌ చెక్‌ అవసరం ఉన్న పాస్‌పోర్ట్‌ హోల్డర్లకు ఆరెంజ్‌ రంగు పాస్‌పోర్డు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. బీజేపీ వివక్షాపూరిత ఆలోచనా ధోరణిని ఇది సూచిస్తోందని విమర్శించారు. ‘వలస కార్మికులను రెండో తరగతి పౌరులుగా బీజేపీ పరిగణించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ చర్యలు బీజేపీ వివక్షాపూరిత ఆలోచన ధోరణిని సూచిస్తున్నాయి’ అని ధ్వజమెత్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement