
'ఆరెంజ్' సినిమాలో ఓ హీరోయిన్‌గా నటించిన షాజన్ పదామ్సీ ప్రేమలో పడింది.

37 ఏళ్ల ముద్దుగుమ్మ తన ప్రియుడిని పరిచయం చేస్తూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.

ప్రముఖ థియేటర్ల సంస్థ మూవీ మ్యూక్స్ సీఈఓ ఆశిష్ కనాకియాతో నిశ్చితార్థం చేసుకుంది.

గత మూడేళ్లుగా షాజన్-ఆశిష్ డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

రీసెంట్‌గా ఈమెకు ప్రపోజ్ చేసిన ఆశిష్.. తాజాగా షాజన్ చేతికి రింగ్ తొడిగాడు.

ఆ మధుర క్షణాలనే 'ఇకపై కలకాలం నీతోనే' అనే క్యాప్షన్‌తో షాజన్ పోస్ట్ పెట్టింది.

తెలుగులో 'ఆరెంజ్' మూవీతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఇది ఘోరంగా ఫ్లాప్ అయింది.

దీని తర్వాత వెంకటేశ్-రామ్ 'మసాలా' సినిమాలోనూ చేసింది. కానీ అస్సలు కలిసిరాలేదు.

దీంతో టాలీవుడ్‌కి టాటా చెప్పేసి బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. ఇప్పుడు అక్కడ షోలు చేస్తోంది.

37 ఏళ్లొచ్చిన ఇప్పటికీ గ్లామరస్‌గా ఉన్న షాజన్.. వచ్చే ఏడాది పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉంది.






