
ఆ ఇద్దరితో బాధ పడొద్దు
ఆ ఇద్దరితో జీవా బాధపడనవసరం లేదు అంటున్నారు. ఎవరా ఇద్దరు? ఏమా కథ? అనేగా మీ ఆతృత. నటుడు జీవాను యాన్ చిత్రం చాలా నిరాశనే మిగిల్చింది. ఆ చిత్రం తరువాత ఆయన మరో చిత్రం చేయలేదు. తదుపరి చిత్రానికి చాలా గ్యాప్ తీసుకున్న జీవా తన సొంత నిర్మాణ సంస్థ సూపర్‌గుడ్ ఫిలింస్‌లో మేనేజర్ సెంథిల్‌ను నిర్మాతను చేస్తూ తనే సొంతంగా ఒక చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు.
సరిగ్గా అలాంటి సమయంలో కవలై వేండామ్ (బాధపడవద్దు అనే అర్థం) అనే చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. యామిరుక్క భయమే వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన డీకే దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ సంస్థ అధినేత ఎల్ రెడ్ కుమార్ నిర్మించనున్నారు. యాన్ చిత్ర నిర్మాత ఈయనే. ఈ చిత్రం తీవ్ర నష్టాలను కలిగించడంతో తాజా చిత్రం కవలై వేండామ్‌ను జీవా పారితోషికం తీసుకోకుండానే నటించనున్నారని సమాచారం.
ఈ చిత్రంలో ఆయనకు జంటగా కీర్తి సురేష్, కల్రాణి రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. ఇదు ఎన్న మాయం చిత్రంతో కోలీవుడ్‌లో ప్రవేశించిన కీర్తి సురేష్, డార్లింగ్ చిత్రంతో సక్సెస్‌ను అందుకున్న నిక్కి కల్రాణి ప్రస్తుతం తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. దీంతో వీరిద్దరి కాల్‌షీట్స్ సర్దుబాటు కాగానే కవలై వేండామ్ చిత్రం మొదలవుతుందని చిత్ర యూనిట్ వర్గాలు సమాచారం.