యువ నటుడు విక్రమ్ ప్రభు ఇంగ్లిష్ భామ ప్రేమలో మునిగితేలుతున్నారట. అంటే ఇది రీల్ లవ్ అన్నమాట. కుంకి, శిఖరం తొడు, వెళ్లక్కార దురై అంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్న విక్రమ్ ప్రభు ఇప్పటికే ఇదు ఎన్న మాయ అంటూ విజయ్ దర్శకత్వంలో కీర్తి సురేష్‌తో రొమాన్స్ చేస్తున్నారు. తాజాగా వాగ చిత్రంలో నటించడానికి రెడీ అయిపోయారు. జి ఎన్ ఆర్ కుమరవేలన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవలే కారైకుడిలో ప్రారంభమైంది. ఇది ఒక భారత యువకుడికి పాకిస్తాన్ యువతి ప్రేమలో పడే ఇతివృత్తంతో తెరకెక్కుతున్న విభిన్న ప్రేమ కథా చిత్రం అని దర్శకుడు అంటున్నారు. ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు సరసన హిందీ బుల్లితెర నటిని హీరోయిన్‌గా ఎంపిక చేశారు.
అయితే ఆమె గురించి వివరాలను మాత్రం ప్రస్తుతానికి రహస్యం అంటున్నారు. కోలీవుడ్‌కు పరిచయం చేయనున్న ఆ భామ పేరును కూడా మార్చేయాలనుకున్నారట. ఈ చిత్ర షూటింగ్‌ను కారైకుడిలో 10 రోజుల పాటు నిర్వహించనున్నారు. అక్కడ కొన్ని సన్నివేశాలతోపాటు హీరో హీరోయిన్లపై ఒక డ్యూయెట్ సాంగ్‌ను కూడా చిత్రీకరించనున్నట్లు దర్శకుడు తెలిపారు. తదుపరి షెడ్యూల్‌ను మార్చి నుంచి 55 రోజుల పాటు కులుమనాలిలో నిర్వహించనున్నారు. ప్రత్యేక అనుమతితో వాఘా సరిహద్దులో కూడా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు దర్శకుడు తెలిపారు.
ఇంగ్లిష్ భామ ప్రేమలో విక్రమ్ ప్రభు
Published Wed, Feb 18 2015 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 9:29 PM
Advertisement
Advertisement