ఎంతో విలువైన ఆ క్షణాలు... | trisha romance with Vikram Prabhu | Sakshi
Sakshi News home page

ఎంతో విలువైన ఆ క్షణాలు...

Published Thu, Dec 25 2014 11:26 PM | Last Updated on Sat, Sep 2 2017 6:44 PM

ఎంతో విలువైన ఆ క్షణాలు...

ఎంతో విలువైన ఆ క్షణాలు...

త్రిష చెప్పలేనంత సంతోషంతో ఉన్నారు. మహానటుడు శివాజీ గణేశన్ మనవడు, నటుడు ప్రభు తనయుడు విక్రమ్ ప్రభు సరసన ఓ సినిమా చేయబోతున్నారు. దానికి నిర్మాత ప్రభూనే. అయితే... త్రిష ఆనందానికి కారణం ఈ సినిమా కాదు. ఈ సినిమాలో నటించే విషయంలో అంగీకార పత్రాలపై సంతకం చేయడానికి త్రిష ఇటీవలే ప్రభు ఇంటికెళ్లారు. ప్రభు ఇల్లంటే... తమిళ సినీనటులకు ఓ దేవాలయం. కారణం... అది స్వర్గీయ మహానటుడు శివాజీగణేశన్ ఇష్టంగా కట్టుకున్న ఇల్లు. ఆ ఇంట్లోనే దశాబ్దాల పాటు ఆయన నివసించారు.
 
 ఆ ఇంట్లోనే ఆయన పరమపదించారు. అలాంటి ఇంట్లోకి తొలిసారి అడుగుపెట్టారు త్రిష. పైగా లంచ్ టైమ్ అవడం వల్ల... శివాజీగణేశ న్ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం కూడా చేశారు. ‘‘శివాజీగారింట్లో నేను గడిపిన క్షణాలే... నా జీవితంలో అత్యంత విలువైన క్షణాలు’’  అని త్రిష చెప్పుకొచ్చారు. ‘‘శివాజీ సార్‌ను చిన్నప్పుడు దూరం నుంచి చూశాను. ఆయన సినిమాలంటే మా ఇంట్లో అందరికీ ప్రాణం. తమిళుల గౌరవాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప నటుడాయన. ఆ మహానుభావుడు తిరిగిన ఇంట్లో కొన్ని నిమిషాలైనా గడపగలగడం నా అదృష్టం’’ అంటూ త్రిష తెగ సంబరపడిపోయారు. .
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement