విక్రమ్ ప్రభుతో అలియా భట్? | Vikram Prabhu to romance Alia Bhatt? | Sakshi
Sakshi News home page

విక్రమ్ ప్రభుతో అలియా భట్?

Published Mon, May 26 2014 12:14 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

విక్రమ్ ప్రభుతో అలియా భట్? - Sakshi

విక్రమ్ ప్రభుతో అలియా భట్?

యువ సక్సెస్‌ఫుల్ నటుడు విక్రమ్ ప్రభుతో బాలీవుడ్ సంచలన బ్యూటీ అలియా భట్ రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ల నుంచి యువ హీరోయిన్ల వరకు కోలీవుడ్ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి రెడీగా ఉండడం విశేషం. ఐశ్వర్యారాయ్ నుంచి దీపిక పదుకునేల వరకు కోలీవుడ్‌లో విజయానందాన్ని అనుభవించిన వాళ్లే. తాజాగా తొలి చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ నుంచి హైవే, 2 స్టేట్స్ వరకు వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉన్న బాలీవుడ్ భామ అలియాభట్ కోలీవుడ్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

 ప్రస్తుతం యువ క్రేజీ హీరోల్లో ఒకరిగా వెలుగొందుతున్న విక్రమ్ ప్రభుతో ఒక భారీ యాక్షన్ కథా చిత్రాన్ని తెరకెక్కించడానికి దర్శకుడు జీఎన్‌ఆర్ కుమరవేలన్ సిద్ధం అయ్యారు. ఈయన ఇంతకు ముందు విమర్శకులు సైతం ప్రశంసలందించిన హరిదాస్ చిత్రానికి దర్శకత్వం వహించారన్నది గమనార్హం. తాజా చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ, హరిదాస్ చిత్రం తరువాత మలి చిత్రం కోసం ఏడాది వేచి ఉన్నానన్నారు. అందుకు కారణం తన కథకు తగిన కథా నాయకుడి కోసమేనని చెప్పారు. తన కథలోని హీరో పాత్రకు విక్రమ్ ప్రభు టైలర్‌మేడ్ అనిపించడంతో ఆయన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు.

 ఆయనకు జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియాభట్‌ను ఎంపిక చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఆమెను సంప్రదించగా, ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పారు. అయితే ఇంకా అలియాభట్‌ను సెలక్ట్ చెయ్యలేదని కేవలం సంప్రదించామని మాత్రమే చెప్పారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. చిత్ర కథ విషయంలో మాత్రం దర్శకుడు నోరు విప్పడంలేదు. అయితే ఇదొక సైనికుడి ఇతివృత్తంతో సాగే  చిత్ర మని తెలిసింది. ఇందులో విక్రమ్ ప్రభు దేశ సరిహద్దులోని వీర సైనికుడిగా నటించనున్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement