నెరుప్పుడా అంటున్న విక్రమ్‌ప్రభు | he young actor vikramprabhu Neruppuda | Sakshi
Sakshi News home page

నెరుప్పుడా అంటున్న విక్రమ్‌ప్రభు

Published Thu, Jul 7 2016 1:23 AM | Last Updated on Mon, Sep 4 2017 4:16 AM

నెరుప్పుడా అంటున్న విక్రమ్‌ప్రభు

నెరుప్పుడా అంటున్న విక్రమ్‌ప్రభు

ఇటీవల ప్రతి సినీ అభిమాని నోట వినిపిస్తున్న మాట నెరుప్పుడా. కారణం సూపర్‌స్టార్ కబాలి చిత్రంలో ఒక పాటలో పదమే నెరుప్పుడా. ఇప్పుడీ పదం యువ నటుడు విక్రమ్‌ప్రభు చిత్రానికి పేరుగా మారింది. ఎస్‌ఈ కుంకీ చిత్ర హీరో దివంగత  మహానటుడు శివాజీగణేశన్ మనవడు, సీనియర్ నటుడు ప్రభు వారసుడు అన్న విషయం తెలిసిందే. అతి కొద్దికాలంలోనే నటుడిగా తన కంటూ ఒక గుర్తింపును సంపాందించుకున్న విక్రమ్‌ప్రభు తాజాగా సొంతంగా ఫస్ట్ ఆర్టిస్ట్ అనే చిత్ర నిర్మాణ సంస్థను నెలకొలిపారు. దీని ఆవిష్కరణ కార్యక్రమం, ఈ బ్యానర్‌లో నిర్మించనున్న తొలి చిత్రం నెరుప్పుడా చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం స్థానిక సౌత్ బోగ్ రోడ్డులో గల అన్నై ఇల్లం(శివాజిగణేశన్ గృహం)లో నిర్వహించారు. చిత్ర బ్యానర్‌ను ప్రముఖ నిర్మాత ఏవీఎం. శరవణన్ ఆవిష్కరించగా, చిత్ర టైటిల్‌ను నిర్మాత, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను ఆవిష్కరించారు.


కబాలి చిత్రంలో పాటలోని నెరుప్పుడా పదాన్ని తమ చిత్రానికి టైటిల్‌గా వాడుకోవడానికి ఆ చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థానును అడగ్గా ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా వెంటనే అనుమతించారని చిత్ర నిర్మాత, కథానాయకుడు విక్రమ్‌ప్రభు వెల్లడించారు. ఈయన ఈ చిత్రాన్ని చంద్రా ఆర్ట్స్, సినీ ఇన్నోవేషన్స్ సంస్థలతో కలిసి నిర్మించనున్నారు. దీనికి సీనియర్ సినీ పీఆర్‌ఓ డైమండ్‌బాబు లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. నెరుప్పుడా చిత్రంలో విక్రమ్‌ప్రభు అగ్నిమాపక దళ అధికారిగా, రజనీకాంత్ వీరాభిమానిగా నటించనున్నారట. ఇందులో ఆయనకు జంటగా నిక్కీగల్రాణి నటిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రల్లో పొన్‌వన్నన్,నాన్‌కడవుల్ రాజేంద్రన్, ఆడుగళం నరేన్, మధుసూదన్‌రావు, నాగినీడు నటిస్తున్నారు. అశోక్‌కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి షాన్ రోల్డాన్ సంగీతాన్ని, ఆర్‌డీ.రాజశేఖర్ చాయాగ్రహణం అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement