విక్రమ్‌ప్రభుతో జత కుదిరింది | Madonna Sebastian Acting in Vikram Prabhu Movie | Sakshi
Sakshi News home page

విక్రమ్‌ప్రభుతో జత కుదిరింది

Published Sat, Apr 13 2019 10:00 AM | Last Updated on Sat, Apr 13 2019 10:00 AM

Madonna Sebastian Acting in Vikram Prabhu Movie - Sakshi

నటి మడోనా సెబాస్టియన్‌

సినిమా: నటి మడోనా సెబాస్టియన్‌కు విక్రమ్‌ప్రభుతో జత కుదిరింది. ఇంకా చెప్పాలంటే ఈ బ్యూటీ లక్కీచాన్స్‌ను కొట్టేసింది. మలయాళ చిత్రం ప్రేమమ్‌ హీరోయిన్లలో ఒకరైన మడోనా సెబాస్టియన్‌ కోలీవుడ్‌లో నటించింది చాలా తక్కువ చిత్రాలే. అప్పుడెప్పుడో నటుడు ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో నటించిన పవర్‌పాండి చిత్రంలో ఆయనతో నటించింది. ఆ తరువాత జుంగాలో అతిథిగా మెరిసింది. అయితే ప్రస్తుతం శశికుమార్‌కు జంటగా కొంబువచ్చ సింగం చిత్రంలో నటిస్తోంది. వీటితో పాటు మలయాళం, కన్నడం చిత్రాల్లోనూ నటిస్తున్న మడోనా సెబాస్టియన్‌కు తాజాగా కోలీవుడ్‌లో మరో అవకాశం వచ్చింది. దర్శకుడు మణిరత్నం చిత్రంలో నటించే లక్కీచాన్స్‌ కొట్టేసింది.

మణిరత్నం మెడ్రాస్‌ టాకీస్‌పై ఇరువర్, నేరుక్కునేర్, ఉయిరే, అలైప్పాయుదే, రావణన్, కాట్రు వెళియిడై, సెక్క సివంద వానం చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే. తాజాగా మల్టీస్టారర్‌తో పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రాన్ని లైకా సంస్థతో కలిసి తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆయన నిర్మాతగా తన శిష్యుడు ధనా దర్శకత్వంలో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నటుడు విక్రమ్‌ప్రభు క«థానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా నటి మడోనా సెబాస్టియన్‌ నటించనుంది. ఇక విక్రమ్‌కు సోదరిగా నటి ఐశ్వర్యరాజేశ్‌ నటించనుంది. విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి కథ, మాటలను మణిరత్నమే సమకూర్చడం. అంతే కాదు ధనాతో కలిసి కథనాన్ని రాశారు. ఈ చిత్రానికి వానం కొట్టట్టుం అనే టైటిల్‌ను నిర్ణయించారు. దీనికి 96 చిత్రం ఫేమ్‌ గోవింద్‌ వసంత్‌ సంగీతాన్ని, ప్రీతా ఛాయాగ్రహణం అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. ప్రస్తుతం విక్రమ్‌ప్రభు అసురగురు, వాల్టర్‌ చిత్రాల్లో నటిస్తున్నారన్నది గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement