నెరుప్పుడాకు యూ సర్టిఫికెట్‌ | Vikram Prabhu Neruppuda Censor complete | Sakshi
Sakshi News home page

నెరుప్పుడాకు యూ సర్టిఫికెట్‌

Published Sun, Jul 23 2017 10:23 AM | Last Updated on Tue, Sep 5 2017 4:43 PM

నెరుప్పుడాకు యూ సర్టిఫికెట్‌

నెరుప్పుడాకు యూ సర్టిఫికెట్‌

తమిళసినిమా: నెరుప్పుడా చిత్రం నటుడు విక్రమ్‌ప్రభుకు తొలి సంతోషాన్ని అందించింది. నటనపై తపన ఉన్న నటుల్లో విక్రమ్‌ప్రభు ఒక్కరని చెప్పవచ్చు. పాత్రకు జీవం పోయడానికి తపించే ఆయనకు ఇటీవల వీరశివాజి, క్షత్రియన్ చిత్రాల రిజల్ట్‌ సంతృప్తి నివ్వలేదు. నటుడిగా చాలా తక్కువ వయసులోనే సినిమా మీద ఉన్న అపార ప్రేమతో నిర్మాతగా మారారు విక్రమ్.

 ఫస్ట్‌ఆర్టిస్ట్‌ బ్యానర్‌పై తానే స్వయంగా నిర్మిస్తూ, కథానాయకుడాగా నటిస్తున్న తొలి చిత్రం నెరుప్పుడా. ఇందులో ఆయనకు జంటగా నిక్కీగల్రాణి నటిస్తోంది.కొత్త దర్శకుడు అశోక్‌కుమార్‌ ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు.  నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు యూ సర్టిఫికెట్‌ అందించింది.

తమిళ నాట యూ సర్టిఫికేట్ పొందిన చిత్రాలకు ప్రభుత్వ రాయితీలు వర్తిస్తాయి. అందుకే తమిళ చిత్రాలన్నింటికి తమిళ్ పేర్లనే నిర్ణయిస్తారు దర్శక నిర్మాతలు. అదే సమయంలో క్లీన యు సర్టిఫికేట్ వచ్చే విధంగా సినిమాలను తెరకెక్కిస్తారు. నెరుప్పుడా చిత్రం యూ సర్టిఫికెట్‌ పొంది ఆ చిత్ర నిర్మాత విక్రమ్‌ప్రభుకు తొలి సంతోషాన్ని అందించింది.చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement