
విజయాల బాటలో విక్రమ్
ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ నటుల్లో విక్రమ్ ప్రభు పేరు ముందు ఉంటుంది. కుంకి తో తొలి విజయాన్ని అందుకున్న ఈయన చిత్రం తరువాత చిత్రం చేసుకుంటూ వరుసగా విజయాలను అందుకుంటున్నారు. ఇటీవలే శిఖరం తొడు చిత్రంతో మంచి విజయాన్ని పొందిన విక్రమ్ ప్రభు ఈసారి తన చిత్రాల వేగాన్ని పెంచారు. ప్రస్తుతం ఎళిల్ దర్శకత్వంలో వెళ్లైక్కార దురై చిత్రంతో పాటు ఎఎల్ విజయ్ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నారు.
మ్యాజిక్ ఫ్రేమ్స్ పతాకంపై నటుడు శరత్‌కుమార్, రాధిక శరత్‌కుమార్, ఎస్టిన్ స్టీఫెన్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇదు ఎన్న మాయం అనే పేరును నిర్ణయించా రు. ఏఎల్ విజయ్, అమలాపాల్‌ను వివాహం చేసుకున్న తరువాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంంగా నిర్మాణం జరుపుకుంటోంది. ఇదే మ్యాజిక్ ఫ్రేమ్స్ పతాకంపై శరత్‌కుమార్ హీరోగా చండమారుతం అనే చిత్రం తెరకెక్కుతోంది. అదే విధంగా ధనుష్, కాజల్ అగర్వాల్ జంటగా మారి చిత్రాన్ని ఈ సంస్థే నిర్మిస్తోంది.