హన్సికకు లక్కీచాన్స్! | lucky chance to Hansika | Sakshi
Sakshi News home page

హన్సికకు లక్కీచాన్స్!

Published Sat, Dec 24 2016 1:52 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM

హన్సికకు లక్కీచాన్స్!

హన్సికకు లక్కీచాన్స్!

కేరీర్‌లో ఎత్తుపల్లాలు ఎవరికైనా సహజం. విజయాలే సోపానాలుగా కొనసాగిన వారు ఎవరూ ఉండరు. అయితే అపజయాలను అధిగమించి ముందుకు సాగడమే ప్రధానం. ఇక నటి హన్సిక విషయానికి వస్తే ఆరంభంలోనే విజయ్, సూర్య, జయంరవి, ధనుష్‌ వంటి స్టార్‌ హీరోలతో నటించే అవకాశాలను దక్కించుకున్నారు. మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. దర్శకుల నటిగా పేరు సంపాదించుకున్నారు. అయినా ఎందుకనో ఈ మధ్య అవకాశాలు కాస్త వెనుక బడ్డాయి. ప్రస్తుతం జయంరవికి జంటగా నటించిన భోగన్  చిత్రం ఒక్కటే ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉంది.

అలాగని హన్సిక కాళీగా ఏమీ కూర్చోవడం లేదు. తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు.కోలీవుడ్‌లో అవకాశాలు కొరవడడంతో ఇక హన్సిక పని అయ్యి పోయింది. ఇక్కడ ఇక మూటా ముల్లు సర్దుకోవలసిందే అని చెవులు కొరుక్కునే వారు కొందరు బయలు దేరారు. అలాంటి వారి నోరు మూయించే విధంగా హన్సిక మళ్లీ కోలీవుడ్‌లో బిజీ అవుతున్నారు. భోగన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. తాజాగా యువ నటుడు విష్ణువిశాల్‌తో నటించడానికి హన్సిక రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ బ్యూటీని మరో అవకాశం వరించింది.

విక్రమ్‌ప్రభుకు జంటగా నటించే అవకాశం తలుపుతట్టింది. నవ దర్శకుడు ఎస్‌ఎస్‌.సూర్య మెగాఫోన్ పట్టనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇందులో సూరి హాస్య పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. విశేషం ఏమిటంటే ఇప్పటి వరకూ స్టార్‌ హీరోలతో నటించిన హన్సిక ఇప్పుడు యువ కథానాయకులతో నటించడానికి రెడీ అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement