లిప్‌లాక్కా...
ఆ రోజుల్లో సినిమాల్లో హీరోహీరోయిన్ల మధ్య లిప్‌లాక్ సన్నివేశాలు సర్వసాధారణం అయ్యింది. కొందరు నటీమణులైతే అలాంటి సన్నివేశాలు కావాలని కోరుకుని మరీ నటిస్తున్నారు.అలాంటిది నట కుటుంబం నుంచి, అదీ బాల తారగా బహుళ ప్రాచుర్యం పొందిన నటి షామిలి లిప్‌లాక్ సన్నివేశం అనగానే కాస్త తటపటాయించారట. అంజిలి చిత్రంలో బాలతారగా కోలీవుడ్‌కు పరిచయమైన షామిలి నటి శాలిని సోదరి, నటుడు అజిత్ మరదలు అన్న సంగతి తెలిసిందే. బాల్యంలోనే బహుభాషా బాలతారగా అవార్డులు, రివార్డులు అందుకున్న షామిలి హీరోయిన్‌గా తొలుత మలయాళం, తెలుగు భాషలలో పరిచయమయ్యారు.
ఆ భాషల్లో ఒక్కొక్క చిత్రం చేసిన ఈ బబ్లీగర్ల్ ఆ తరువాత సినిమాకు సంబంధించిన విద్య కోసం అమెరికా వెళ్లారు. ఆ తరువాత చెన్నైకి వచ్చిన షామిలి మళ్లీ నటించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఆమెను నటింపజేయడానికి పలువురు దర్శక నిర్మాతలు ప్రయత్నించినా, చాలా కథలు విన్న ఈ బ్యూటీ చివరికి ధనుష్ సరసన కొడి చిత్రం ద్వారా కోలీవుడ్‌కు నాయకిగా పరిచయం అవ్వాలని భావించారు. అయితే అందులో మరో నాయకిగా త్రిష నటించడంతో తన పాత్రకు ప్రాముఖ్యత ఉండదని ఆ చిత్రం నుంచి వైదొలగినట్లు ప్రచారం జరిగింది.
ఆ తరువాత విక్రమ్‌ప్రభుకు జంటగా వీరశివాజీ చిత్రంలో నటించడానికి అంగీకరించారు. ఇందులో రొమాంటిక్ సన్నివేశాలు చాలా చోటు చేసుకున్నాయట. వాటిలో చాలా క్లోజ్‌గా నటింటాల్సిన పరిస్థితి అట. అలాంటి సన్నివేశాల్లో బాగానే నటించిన షామిలికి లిప్‌లాక్ సన్నివేశంలో నటించాల్సిరావడంతో చాలా సంకటంలో పడ్డారట. అయితే కథకు ఆ సన్నివేశం చాలా అవసరం అవడంతో దర్శకుడు కన్విన్స్ చేసి నటింపజేశారట.
షామిలి కాస్త సంకోచంతోనే నటించినా ఆ లిప్‌లాక్ సన్నివేశం చిత్రంలో చాలా కవితాత్మకంగా రూపుదిద్దుకుందని చిత్ర వర్గాలు అంటున్నారు. నటి షామిలికి వీరశివాజీ చాలా కీలకమైన చిత్రం అవుతుంది. కోలీవుడ్‌లో తన భవిష్యత్‌ను నిర్ణయించే చిత్రంగా ఉంటుంది.అందుకే షామిలి చాలా టెన్షన్‌గా ఉన్నారట. ఈ చిత్రం ఈ నెల 23న విడుదలకు సిద్ధమవుతోంది.