
నటుడు విక్రమ్‌ప్రభుకు ప్రస్తుతం ఒక సక్సెస్ కావాలి. ఈ యువ హీరో 60 వయదు మాణియం, తుపాకీ మునై వంటి చిత్రాలతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నా.. సక్సెస్ పరంగా ఆ చిత్రాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. దీంతో విక్రమ్ ప్రభు రేస్‌లో కాస్త వెనుక పడ్డారనే చెప్పాలి. నటుడిగా ఈయన బిజీగానే ఉన్నారు. ప్రస్తుతం అసురగురు, వాల్టర్ చిత్రాలలో నటిస్తున్నారు. తాజాగా మరో చిత్రానికి కమిట్ అయ్యారు. దీన్ని మాయ, మానగరం వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రొటాంషియల్ సంస్థ నిర్మించనుంది.
ఈ చిత్రం ద్వారా దర్శకుడు వెట్ట్రిమారన్ శిష్యుడు తమిళరసన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా కథానాయకీ, ఇతర నటినటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందనీ, త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఇటీవల చెన్నైలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని వెల్లడించారు. ఈ చిత్ర షూటింగ్‌ను మార్చి రెండవ వారంలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలతో విక్రమ్‌ప్రభు మళ్లీ సక్సెస్ బాట పడతారని ఆశిద్దాం.
Comments
Please login to add a commentAdd a comment