
మండుటెండల కారణంగా షూటింగ్‌లో స్పృహతప్పి పడిపోయే స్థితికి చేరుకున్నానని నటుడు విక్రమ్ ప్రభు పేర్కొన్నారు. ఈయన హీరోగా నటించిన తాజా చిత్రం టాణాక్కారన్. ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు, పి.గోపీనాథ్, తంగ ప్రభాకరన్ కలిసి నిర్మించిన చిత్రం ఇది. నటుడు తమిళ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఈ నెల 8 నుంచి డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. గురువారం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నటుడు విక్రమ్‌ప్రభు మాట్లాడుతూ షూటింగ్‌ను మండుటెండల్లో నిర్వహించినట్లు చెప్పారు. ఒక సమయంలో తానే స్పృహ కోల్పోయే పరిస్థితి నెలకొందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment