
కీర్తీసురేశ్ ,జాన్వీ కపూర్
తమిళసినిమా: సినిమాకు కథ, కథనాలను పక్కన పెడితే హీరోహీరోయిన్ల కాంబినేషన్ బట్టి కూడా వ్యాపారం ఉంటుంది. అలా కోలీవుడ్‌లో స్పెషల్ కాంబినేషన్‌లను కలిపే దర్శకుల్లో వెంకట్‌ప్రభు ఒకరు. ప్రస్తుతం పార్టీ చిత్ర విడుదల కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈయన త్వరలో కొత్త చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో సంచలన నటుడు శింబు కథానాయకుడిగా నటించడానికి సమ్మతించారు. అంతే కాదు ఈ చిత్రానికి మానాడు అనే టైటిల్‌ను కూడా నిర్ణయించారు. దీన్ని సురేశ్‌కామాక్షి తన వీ.హౌస్ పతాకంపై నిర్మించనున్నారు. టైటిల్‌ను బట్టే అర్థం అవుతుంది ఇదో రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనున్న కథా చిత్రం అని. ఈ విషయాన్ని దర్శకుడు వెంకట్‌ప్రభు ధృవీకరించారు.
దీనికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగునున్నాయి. ఇంత వరకూ బాగానే ఉంది. ఇందులో శింబుతో రొమాన్స్ చేసే బ్యూటీ ఎవరన్నది ఆసక్తిగా మారింది. మానాడులో నటించే హీరోయిన్ కోసం ఇద్దరు యువ నటీమణులతో చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. అంతే కాదు వారి పేర్లు కూడా వెల్లడించారు. నటి కీర్తీసురేశ్, అతిలోక సుందరి వారసురాలు జాన్వీలతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. అయితే వీరిలో ఎవరు శింబుతో నటించేది త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు చెప్పారు. అయితే శింబుకు జంటగా నటి జాన్వీ నటిస్తుందన్నది సందేహమే. అయితే ఈ అమ్మడిని దక్షిణాదిలో పరిచయం చేయాలన్న ప్రయత్నాలు మాత్రం చాలా కాలంగానే జరుగుతున్నాయి. ఏదేమైనా మానాడు చిత్రంలో నాయకిగా కీర్తీసురేశ్‌నే నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇ ఇద్దరు బ్యూటీలో ఎవరు శింబుతో జత కట్టినా అది క్రేజీ కాంబినేషనే అవుతుంది. త్వరలోనే ఎవరన్న సస్పెన్ప్ వీడనుందని చిత్ర వర్గాలు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment