హీరో అజిత్ కథానాయకుడిగా నటించిన తుణివు (తెగింపు) చిత్రం విడుదలై ఏడాదిన్నర కాబోతోంది. ఈ చిత్రంతో పాటు హీరో విజయ్ నటించిన వారీసు (వారసుడు) చిత్రం విడుదలైంది. కాగా విజయ్ తదుపరి చిత్రం ప్రారంభం కావడడంతో పాటు షూటింగ్‌కూడా పూర్తి చేసుకోబోతోంది. అయితే అజిత్ తాజా చిత్రం ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు.
(ఇదీ చదవండి: బన్నీ విషయంలో లెక్క తప్పిన అల్లు రామలింగయ్య)
ఆయన 62వ చిత్రాన్ని ఏ ముహుర్తాన ప్రకటించారో గానీ పలు సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ చిత్రానికి నయనతార భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించాల్సి ఉంది. కథ సిద్ధమైంది. ఇక సెట్‌పైకి వెళ్లటమే తరువాయి అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా ఈ చిత్రం నుంచి విఘ్నేష్ శివన్ వైదొలిగారు. ఆయన స్క్రీన్‌ప్లే లైకా ప్రొడక్షన్స్ అధినేతకు, అజిత్‌కు సంతృప్తిని కలిగించకపోవడం కారణమని తెలిసింది. ఆ తరువాత చిత్ర కథ మారింది. దర్శకుడు మారారు. అనూహ్యంగా దర్శకుడు మగిళ్ తిరుమేణి తెరపైకి వచ్చారు. ఈయన చెప్పిన కథ నచ్చడంతో లైకా ప్రొడక్షన్స్ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమైంది.
(ఇదీ చదవండి: శర్వానంద్ పెళ్లికి హాజరైన లవ్ బర్డ్స్.. సోషల్ మీడియాలో వైరల్!)
అజిత్ పుట్టినరోజు సందర్భంగా మే 1వ తేదీన 'విడామయర్చి' అని చిత్ర టైటిల్ వెల్లడించారు. దీంతో షూటింగ్ ప్రారంభం అవుతుందని అందరూ భావించారు. అలాంటి సమయంలో విదేశీ బైక్ ప్రయాణానికి వెళ్లిపోయారు. ఇటీవలే ఆయన తిరిగి రావడంతో జూన్ తొలి వారంలో విరామం వీడి చిత్ర షూటింగ్ మొదలవుతుందని ప్రచారం జరిగింది. ఇందులో నటి త్రిష నాయకిగా నటించబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అలా జరగలేదు. తాజా సమాచారం ప్రకారం అజిత్, దర్శకుడు మగిళ్ తిరుమేణి ప్రస్తుతం లండన్‌లో మకాం పెట్టినట్లు తెలిసింది. విడామయర్చి చిత్ర షూటింగ్ గురించి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చిత్ర షూటింగ్‌ను పలు దేశాల్లో నిర్వహించనున్నట్లు, ఈ నెల చివరిలో షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో నటుడు అజిత్ రెండు విభిన్న గెటప్‌లలో కనిపిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment