Police Complaint Filed On Vijay Film Leo Naa Ready Song - Sakshi
Sakshi News home page

Thalapathy Vijay: చిక్కుల‍్లో హీరో విజయ్.. ఆ కేసు పెట్టడంతో!

Published Mon, Jun 26 2023 2:02 PM | Last Updated on Mon, Jun 26 2023 3:06 PM

Police Case Thalapathy Vijay Leo Song - Sakshi

దళపతి విజయ్‌పై తెలుగు ప్రేక్షకులకు ఎక్కడలేని ఆసక‍్తి. ఈ క్రమంలోనే అతడు హీరోగా నటించిన 'లియో' మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యే అతడి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని 'నా రెడీ' పాట విడుదల చేయగా, అది యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. దళపతి ఫ్యాన్స్ ఈ సాంగ్‌ని రిపీట్స్ లో వింటున్నారు. అలాంటిది ఇప్పుడు విజయ్‌పై ఓ కేసు నమోదు కావడంతో.. అభిమానులంతా అవాక్కయ్యారు.

ఏంటా కేసు?
'లియో' నుంచి వచ్చిన 'నా రెడీ' పాటలో విజయ్ సింపుల్ స్టెప్పులేసినప్పటికీ.. ట్యూన్ మంచి ఎనర్జిటిక్ గా ఉండటంతో అలరిస్తోంది. అయితే ఈ సాంగ్ మొత్తాన్ని ఓ డెన్ లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. గీతంలోని ప్రతి సీన్ లోనూ విజయ్.. నోటిలో సిగరెట్ తో కనిపించాడు. ఇప్పుడు ఆ విషయమై చెన్నైకి చెందిన సామాజిక కార్యకర్త ఆర్‌టీ సెల్వం కోర్టుని ఆశ్రయించారు. విజయ్, చిత్రబృందంపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ యాక్ట్ కింద వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.
 

(ఇదీ చదవండి: 'ఆదిపురుష్ 2' ప్లాన్.. ఆ క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్!)

విజయ్‌పైనే ఎందుకు?
సాధారణంగా సినిమాల్లో హీరోలు సిగరెట్ స్మోక్ చేస్తూ కనిపించినా సరే అది యాక్టింగ్ వరకే పరిమితం. కానీ ఈ మధ్య విజయ్.. తమిళనాడులోని 10, 12 తరగతుల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులని కలిశాడు. దాదాపు పది గంటలకు పైగా జరిగిన ఈ మీటింగ్ లో.. వాళ్లని నగదు బహుమతులతో సత్కరించడంతో పాటు మంచిగా ఉండాలని, డబ్బులు తీసుకోకుండా ఓటు వేసేలా తల్లిదండ్రులకు ప్రోత్సాహించాలని చెప్పాడు. అలాంటి విజయ్.. ఇప్పుడు సినిమాల్లో సిగరెట్ తాగుతూ నటించడం ఏం బాగోలేదని ఓ వ్యక్తి కేసు వేశాడు. 

'లియో' సంగతేంటి? 
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే 'లియో' తీస్తున్నారని మూవీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్, 'నా రెడీ' పాటలో ఆయా రిఫరెన్స్ లు కనిపించాయని అంటున్నారు. అక్టోబరు 19న ఈ సినిమా తెలుగు-తమిళ భాషల్లో విడుదల కానుందని ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండటంతో తెలుగు హక్కులని నిర్మాతలు భారీ మొత్తానికి అమ్మినట్లు తెలుస్తోంది.

 

(ఇదీ చదవండి: 'ద కేరళ స్టోరీ' సినిమాకు ఓటీటీ కష్టాలు.. కారణం అదేనా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement