Thalapathy Vijay Presents A Diamond Necklace To Nandini - Sakshi
Sakshi News home page

Thalapathy Vijay: హీరో విజయ్ మంచి మనసు.. ఆ అ‍మ్మాయికి డైమండ్ నెక్లెస్!

Published Sat, Jun 17 2023 3:08 PM | Last Updated on Sat, Jun 17 2023 3:36 PM

Thalapathy Vijay Presents Nandini With A Diamond Necklace - Sakshi

దళపతి విజయ్ పేరుకే తమిళ హీరో. కానీ మన హీరోల కంటే అప్పుడప్పుడు ట్రెండింగ్ లో టాప్ లో ఉంటాడు. సినిమాల విషయంలో మన ప్రేక్షకులు విజయ్ ని తెగ ట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడు వాళ్లతోనే విజయ్ ప్రశంసలు అందుకుంటున్నాడు. ఓ అమ్మాయికి డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ గా ఇవ్వడమే దీనికి కారణం. ఇంతకీ ఆ పాప ఎవరు? విజయ్ ఎందుకిచ్చాడు?

ఓవైపు స్టార్ హీరోగా చాలా క్రేజ్ తెచ్చుకున్న విజయ్.. బయటకు చెప్పుకోడు గానీ రాజకీయాలపైనా ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. అందులో భాగంగానే అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు చేస్తూ వార‍్తల్లో నిలుస్తూ ఉంటాడు. తాజాగా 'విజయ్ పీపుల్స్ మూమెంట్'లో భాగంగా చెన్నైలో ఓ ఈవెంట్ జరిగింది. రీసెంట్ గా తమిళనాడులో పరీక్షల ఫలితాలు వచ్చాయి. అందులో టాప్-3లో నిలిచిన వాళ్లని విజయ్ ఈ కార్యక్రమంలో సత్కరించాడు.

తమిళనాడులోని రీసెంట్ గా విడుదల చేసిన 12వ తరగతి ఫలితాల్లో నందిని అనే అమ‍్మాయికి 600కి 600 మార్కులు వచ్చాయి. చదువుల‍్లో అద్భుతమైన ప్రతిభ చూపించిన ఆమెకు డైమండ్ నెక్లెస్ ని విజయ్ గిఫ్ట్ గా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయింది. తెలుగు నెటిజన్స్ కూడా విజయ్ ని మెచ్చుకుంటున్నారు. 

(ఇదీ చదవండి: 'ఆదిపురుష్'తో ప్రభాస్ సరికొత్త రికార్డు.. దేశంలో ఫస్ట్ హీరోగా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement