Rajinikanth Jailer Movie:సూపర్‌స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ 'జైలర్'. సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల 10న థియేటర్లలోకి రాబోతుంది. పెద్దగా బజ్ లేని ఈ సినిమా ఇప్పుడు లీగల్ సమస్యల్లో చిక్కుకుంది. ప్రస్తుతం ఈ విషయమే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. త్వరలో కోర్టు హియరింగ్ కూడా ఉంది.
ఒకప్పటితో పోలిస్తే రజినీకాంత్ సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గింది. సరైన కథాకథనాలు లేకపోవడం, దీంతో బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్టార్ చిత్రాలన్నీ ఫెయిలవుతూ ఉండటం దీనికి ప్రధాన కారణం. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'జైలర్' చేస్తున్నారు. ఇప్పుడు ఈ టైటిల్ తమదే అంటూ మలయాళ దర్శకుడు సక్కిర్ మడతిల్ కోర్టుని ఆశ్రయించారు.
(ఇదీ చదవండి: రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో?)
సదరు మలయాళ డైరెక్టర్ చెప్పిన దాని ప్రకారం.. ఆగస్టు 2021లో కేరళ ఫిల్మ్ ఛాంబర్ లో 'జైలర్' టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నారు. అదే ఏడాది నవంబరులో షూటింగ్ ప్రారంభించారు. కానీ ఆర్థిక సమస్యల వల్ల ప్రొడక్షన్ ఆలస్యమైంది. ఈ రెండు సినిమాల స్టోరీలు వేర్వేరు అయినప్పటికీ కలెక్షన్స్ పై ఆ ఎఫెక్ట్ పడుతుందని సక్కిర్ అభిప్రాయపడ్డారు.
ఈ క్రమంలోనే మిగతా భాషల్లో కుదరకపోయినా మలయాళ వరకు అయినా సరే రజినీకాంత్ సినిమా టైటిల్ మార్చి విడుదల చేయాల్సిందేనని దర్శకుడు సక్కిర్ మడతిల్ పట్టుబడుతున్నారు. మరోవైపు మార్కెట్ పరంగా తమ చిత్రానికి ఎక్కడా నష్టం రాకూడదనే ఉద్దేశంతో సన్ పిక్చర్స్ సంస్థ కోర్టుని ఆశ్రయించారు. ఆగస్టు 2న హియరింగ్ ఉంది. ఆ రోజు ఈ వివాదంపై క్లారిటీ వస్తుంది.
#Jailer TITLE change issue.
— Manobala Vijayabalan (@ManobalaV) July 16, 2023
Malayalam director Sakkir Madathil appeals to makers of #Rajinikanth's 'Jailer' to change movie title.
He formally registered the title with the Kerala Film Chamber in August 2021.
His film commenced production on November 6, 2021, concluded on… pic.twitter.com/ELGkbVSowg
(ఇదీ చదవండి: 'బేబీ' హీరోయిన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment