![Urudhi Short Film Launch Chennai Event - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/24/TAMIL-MOVIE.jpg.webp?itok=hsH-F1Ko)
కలైంజర్ కరుణానిధి శత జయంతి సందర్భంగా తమిళనాడును మాదక ద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా కృషి చేస్తున్నారని మంత్రి రఘుపతి అన్నారు. మాదక ద్రవ్యాల వ్యసనం కారణంగా కుటుంబాలు ఎలా బాధింపునకు గురవుతున్నాయన్న ఇతి వృత్తంతో గతంలో ఒళక్కం అనే షార్ట్ ఫిల్మ్ తీశారు. తాజాగా పల్ సమయ నల్లురవు సంఘం ఆధ్వర్యంలో జె.ముహమద్ రవి 'ఉరుది' అనే లఘు చిత్రాన్ని నిర్మించారు. ఈ రెండింటికీ మంగై అరిరాజన్ దర్శకత్వం వహించారు.
(ఇదీ చదవండి: 50 ఏళ్ల వయసులో 'మళ్లీ పెళ్లి'.. సీనియర్ నటి క్లారిటీ)
ఉరుది లఘు చిత్ర పరిచయ కార్యక్రమం చైన్నెలో జరిగింది. మంత్రి రఘుపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నటుడు రాజేశ్, ఎమ్మెల్యే ఏఎంవీ ప్రభాకర్‌రాజా, కోటై అబ్బాస్ తదితరులు అతిథులుగా పాల్గొని లఘు చిత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. మంత్రి రఘుపతి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల కారణంగా జరిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కలిగించే విధంగా ఈ లఘు చిత్రాన్ని నిర్మించిన జే.ముహమద్ రవి, దర్శకుడు మంగై అరిరాజన్‌లకు ధన్యవాదాలు తెలిపారు.
మాదక ద్రవ్యాలు లేని తమిళనాడుగా మార్చడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. యువత కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఒక వ్యక్తి మద్యానికి బానిసైతే అతనితో పాటు అతని కుటుంబం బాధింపునకు గురవుతుందని మంత్రి తెలిపారు.
(ఇదీ చదవండి: సమంత డిజైనర్ చీర.. ధర ఎంతో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment