Vani Bhojan Interesting Comments On Glamour Show At Tamil Rockerz Web Series Promotion - Sakshi
Sakshi News home page

Vani Bhojan: అందాల ఆరబోతలో తప్పేం లేదు

Published Thu, Aug 18 2022 8:39 AM | Last Updated on Thu, Aug 18 2022 11:00 AM

Vani Bhojan Interesting Comments On Glamour Show in Tamil Rockers Promotion - Sakshi

ఎయిర్‌ హోస్టెస్‌గా కెరియర్‌ మొదలెట్టిన నటి వాణి బోజన్‌. ఆ తరువాత మోడలింగ్‌ రంగంలోకి ప్రవేశింంది. అనంతరం టీవీ వ్యాఖ్యాతగా, బుల్లితెర నటిగా గుర్తింపు పొందింది. అలా ఓ మై కడవులే చిత్రంతో నటిగా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో రెండో కథానాయికగా మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఆ తరువాత ఆ తరహా పాత్రలే వస్తున్నాయి. కానీ కథానాయికగా ప్రాముఖ్యత కలిగిన కథా పాత్రలు రావడం లేదనే చెప్పాలి.

చదవండి: హాట్‌టాపిక్‌గా ధనుష్‌ రెమ్యునరేషన్‌.. ఒక్క సినిమాకే అన్ని కోట్లా!

తాజాగా అరుణ్‌ విజయ్‌ కథానాయకుడిగా నటింన తమిళ్‌ రాకర్స్‌ వెబ్‌ సిరీస్‌లోనూ రెండో కథానాయిక పాత్రలోనే నటించింది. ఈ వెబ్‌ సిరీస్‌ 19వ తేదీ నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. కాగా దీని ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. అయితే సినిమాల్లో నటిస్తూనే సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ తన హాట్‌హాట్‌ ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్‌ షేర్‌ చేస్తు ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ప్రమోషన్లో యాంకర్‌ అవకాశాలు కోసం అందాలారబోతకు సిద్ధం అయినట్టున్నారే? అని ప్రశ్నించింది.

చదవండి: ఆనందం కంటే బాధే ఎక్కువగా ఉంది: అనుపమ ఆసక్తికర వ్యాఖ్యలు

దీనికి ఆమె స్పందిస్తూ.. అవును.. అందులో తప్పేముంది అని తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చింది. అయినా తాను చీర ధరించినా గ్లామరస్‌గా ఉన్నావంటున్నారని చెప్పింది. కాలానికి తగ్గట్టు ఆలోచనలు మారాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చింది. ఇక ప్రేమ గురించి అడిగిన ప్రశ్నకు తాను పదహారేళ్ల వయసులోనే ప్రేమలో పడ్డానని, ఆ వెంటనే బ్రేకప్‌ కూడా అయిపోయిందని తెలిపింది. అయితే అదే సమయంలో తనకు అనేక ప్రేమ లేఖలు వస్తుండటంతో బ్రేకప్‌ గురించి పెద్దగా పట్టించుకోలేదని వాణి బోజన్‌ చెప్పుకొచ్చింది. కాగా ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలతో ఏ వత్రం అవకాశాలను రాబట్టుకుంటుందో చూడాలి.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement