
చెన్నై సినిమా: తన భావాలతో ఏకీభవిస్తేనే ఎవరికైనా తన కార్యాలయంలోకి అనుమతి ఉంటుందని దర్శక నిర్మాత పా.రంజిత్ అన్నారు. 'అట్టకత్తి'తో దర్శకుడిగా పరిచయమైన ఈయన ఆ తర్వాత మద్రాస్, కబాలి, కాలా, సర్పట్టా వంటి విజయవంత చిత్రాలకు దర్శకత్వం వహించారు. అదే విధంగా నిర్మాతగానూ నీలం ప్రొడక్షన్స్ పతాకంపై నవ దర్శకులకు అవకాశం కల్పిస్తూ వైవిధ్యభరిత చిత్రాలను నిర్మిస్తున్నారు.
నీలం ప్రొడక్షన్స్, గోల్డెన్ రాటీయో ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన తాజా చిత్రం 'రైటర్'. సముద్రఖని ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో ఇనియా నాయికగా నటించారు. ఈ చిత్రం ద్వారా ఫ్రాంక్లిన్ జాకోబ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గోవింద్ వసంత సంగీతాన్ని అందించిన 'రైటర్' చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం మీడియో సమావేశంలో పా.రంజిత్ మాట్లాడుతూ.. సమాజంలోని సమస్యలను ఆవిష్కరించే విధంగా తన చిత్రాలు ఉంటాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment