
సూపర్‌స్టార్స్‌తో బ్రూస్‌లీ-2 ఆడియో హంగామా
సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్, మెగాస్టార్‌ల సమక్షంలో బ్రూస్‌లీ-2 చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలో బ్రహ్మాండంగా నిర్వహిస్తామని ఆ చిత్ర నిర్మాతలు వెల్లడించారు. టాలీవుడ్ యువ స్టార్ హీరో రామ్‌చరణ్ నటించిన తాజా తెలుగు చిత్రం బ్రూస్‌లీ. క్రేజీ నటి రకుల్‌ప్రీతి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో నదియా,అమిదాస్, షియాజీషిండే, రావ్మ్రేష్ ముఖ్యపాత్రలు పోషించారు. ఇక ఎన్నై అరిందాల్ చిత్రంలో విలన్‌గా కొత్త అవతారమెత్తి దుమ్మురేపిన నటుడు అరుణ్ విజయ్ మరోసారి ఈ చిత్రంలోనూ విలనీయం ప్రదర్శించడం విశేషం. ఇక మెగాస్టార్ చిరంజీవి అతిథి పాత్రలో మెస్మరైజ్ చేయనుండడం చిత్రానికే హైలైట్.ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు శ్రీనువైట్ల తెరకెక్కించిన తాజా భారీ చిత్రం ఇది.
ఈ చిత్రాన్ని సెల్వందన్ వంటి విజయవంతమైన చిత్రాన్ని తమిళ ప్రేక్షకులకు అందించిన భద్రకాళీ ఫిలింస్ అధినేత ప్రసాద్ బ్రూస్‌లీ-2 పేరుతో తమిళంలోకి అనువదిస్తున్నారు.అడ్డాల వెంకట్రావు,సత్య సీతల సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్ర వివరాలను వెల్లడించడానికి శుక్రవారం సాయంత్రం చెన్నైలోని ఏవీఎం స్టూడియోలోని ఏసీ థియేటర్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నిర్మాత భద్రకాళీప్రసాద్ మాట్లాడుతూ సెల్వందన్ వంటి విజయవంతమైన చిత్రం తరువాత రామ్‌చరణ్, అల్లుఅర్జున్ నటించిన మల్టీస్టారర్ చిత్రం ఎవడును మగధీర పేరుతో తమిళంలోకి రూపొందిస్తున్నామని అని తెలిపారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుందని తాజాగా రామచరణ్ నటించిన బ్రూస్‌లీ చిత్రాన్ని తమ బ్యానర్‌లో బ్రూస్‌లీ-2గా విడుదల చేయడం సంతోషంగా ఉందని అన్నారు.ఇది బ్రహ్మాండమైన యాక్షన్ ఓరియెంటెడ్ కథా చిత్రం అని చెప్పారు.
చిత్రంలో థియేటర్స్ అధిరేలాంటి ఐదు పోరాట సన్నివేశాలు చోటు చేసుకుంటాయన్నారు. చిత్రాన్ని ఏక కాలంలో తమిళం,తెలుగు భాషల్లో అక్టోబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. అంతకు ముందుగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని బ్రహ్మాండం గా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సూపర్‌స్టార్ రజనీకాం త్, మెగాస్టార్ చిరంజీవి, చిత్ర హీరో రామ్‌చరణ్ వంటి స్టార్ నటులు హాజరవుతారని పేర్కొన్నారు.బ్రూస్‌లీ-2 చిత్రానికి ఏఆర్‌కే రాజరాజన్ మాటలు, వివేక్ పాటలు రాశారు.