దటీజ్ 'కబాలి' | Shanmukha Films Bags Kabali Telugu Rights for Highest Sum Ever | Sakshi
Sakshi News home page

దటీజ్ 'కబాలి'

Published Thu, Jun 9 2016 2:50 PM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM

దటీజ్ 'కబాలి'

దటీజ్ 'కబాలి'

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ 'కబాలి' విడుదలకు ముందే రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ట్రైలర్ తోనే దుమ్మురేపిన ఈ చిత్రం హక్కులు తెలుగులో భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్టు టాలీవుడ్ సమాచారం. షణ్ముఖ ఫిలిమ్స్ కు చెందిన ప్రవీణ్ కుమార్, కేపీ చౌదరి 'కబాలి' తెలుగు హక్కులు సొంతం చేసుకున్నారు. ఎంత మొత్తానికి హక్కులు దక్కించుకున్నారనేది అధికారికంగా వెల్లడికాలేదు. ఇప్పటివరకు ఏ డబ్బింగ్ సినిమా ఇవ్వనంత మొత్తం ఇచ్చి హక్కులు దక్కించుకున్నారని తెలుస్తోంది.

ఇప్పటివరకు లీడింగ్ డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్న ప్రవీణ్ కుమార్, కేపీ చౌదరి 'కబాలి'తో నిర్మాతలుగా మారుతున్నారు. అగ్రనిర్మాతలతో పోటీపడి ఈ సినిమా రైట్స్  దక్కించుకున్నారు. తమ బేనర్ పై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. యువ దర్శకుడు పా రంజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రజనీకాంత్ కు జోడిగా రాధిక ఆప్టే నటించింది.

ఇటీవల రిలీజ్ అయిన రజనీ లేటెస్ట్ సినిమా కబాలి టీజర్ కు అనూహ్య  స్పందన వచ్చింది. ఒక్కరోజులోనే 50 లక్షల మంది ఈ టైలర్ ను వీక్షించారు. రెండు కోట్లకు పైగా వ్యూస్ తో ఇండియాలోనే అతి ఎక్కువ మంది వీక్షించిన తొలి సినిమాగా రికార్డ్ సృష్టించింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 1న రిలీజ్ కు రెడీ అవుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement