సూపర్ స్టార్ స్పీడు అందుకేనా..? | Rajinikanths next with Pa Ranjith to roll from May | Sakshi
Sakshi News home page

సూపర్ స్టార్ స్పీడు అందుకేనా..?

Published Fri, Apr 14 2017 1:16 PM | Last Updated on Tue, Sep 5 2017 8:46 AM

సూపర్ స్టార్ స్పీడు అందుకేనా..?

సూపర్ స్టార్ స్పీడు అందుకేనా..?

సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక సినిమా పూర్తయితే గాని మరో సినిమాకు అంగకీరించడు. అది కూడా సినిమా పూర్తయిన తరువాత రెండు మూడు నెలలకు పైగా గ్యాప్ తీసుకున్న తరువాతే మరో సినిమాను మొదలు పెడతాడు. చాలా ఏళ్లుగా రజనీ ఇదే సిస్టమ్ ఫాలో అవుతున్నారు. అయితే తన నెక్ట్స్ సినిమా విషయంలో మాత్రం రూట్ మార్చాలని నిర్ణయించుకున్నాడట రజనీ.

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 2.0 సినిమాలో నటిస్తున్న రజనీ ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతోంది. భారీ బడ్జెట్ తో అదే స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఈ సినిమా షూటింగ్ ఇప్పట్లో పూర్తయ్యే ఛాన్స్ లేదు. కానీ 2.0 సెట్స్ మీద ఉండగానే రజనీ మరో సినిమాను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. కబాలీ ఫేం పా రంజిత్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు రజనీ. ఈసినిమాను వచ్చే నెల రెండో వారం ప్రారంభించాలని ఫిక్స్ అయ్యారట.

ఒక సినిమా సెట్స్ మీద ఉండగా మరో సినిమా గురించి ఆలోచించని రజనీ తన అల్లుడు నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమా కోసం ఈ రూల్ ను మార్చుకున్నారట. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను ధనుష్ నిర్మిస్తున్నాడు. అందుకే ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడట. కబాలి సినిమాతో భారీ హైప్ క్రియేట్ చేయటంలో సక్సెస్ అయిన రంజిత్, సినిమాతో మాత్రం నిరాశపరిచాడు. మరి రజనీ ఇచ్చిన ఈసెకండ్ ఛాన్స్ ను ఎంత వరకు సక్సెస్ చేస్తాడో చూడలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement