KGF Chapter 2 Telugu Digital Rights Sold To Dil Raju: Check Record Price - Sakshi
Sakshi News home page

భారీ ధరకు కేజీఎఫ్‌ 2 తెలుగు రైట్స్.. దక్కించుకుంది అతడే

Published Tue, Feb 23 2021 1:46 PM | Last Updated on Tue, Feb 23 2021 6:10 PM

KGF Chapter 2 Telugu Rights Sold To Dil Raju For Record Price - Sakshi

కేజీఎఫ్‌ సినిమా గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి అంచాలు లేకుండా విడుదలై.. రికార్డులు సృష్టించిన సినిమా అది. ఆ ఒక్క సినిమాతోనే కన్నడ హీరో యశ్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2. ఈ సినిమా విడుదలకు ముందే భారీ క్రేజ్ వచ్చింది. ఈ  సినిమా కోసం అన్ని భాషల  ఆడియన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. 

అంచనాలకు తగ్గట్టుగానే అన్ని భాషల్లోనూ ఈ సినిమాకు భారీగా బిజినెస్‌ జరుగుతోంది. ఈ సినిమాకు నిర్మాతలు చెప్తున్న ధరలు విని బయ్యర్లకు వణుకు పుడుతుందట. ఈ చిత్రం ఓవర్సీస్ హక్కుల కోసం ఏకంగా 80 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. వీటితో పాటు  దేశవ్యాప్తంగా పలు భాషల రైట్స్‌కు ​కూడా నిర్మాతలకు భారీగానే ధరలు చెబుతున్నట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే కేజీఎఫ్‌ 2 తెలుగు థియేట్రికల్‌ రైట్స్‌ సంబంధించి ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. కేజీఎఫ్‌ కేజీఎఫ్ చాప్టర్ 2 తెలుగు హక్కులను ప్రముఖ​ నిర్మాత దిల్‌ రాజు కొనుగోలు చేసినట్లు ఈ వార్త సారాంశం. మొదట కేజీఎప్‌ 1 తెలుగు హక్కుల్ని దక్కించుకున్న వారాహి సంస్థ .. కేజీఎఫ్‌ 2 హక్కులను కూడా అడిగిందట. అయితే నిర్మాతలు ఎక్కువ చెప్పడంతో వారాహి సంస్థ తప్పుకుందట. దీంతో దిల్‌ రాజు రంగంలోకి దిగి తెలుగు హక్కులను దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ సినిమా కోసం దిల్‌ రాజు ఏకంగా రూ.65 కోట్ల భారీ ధరను వెచ్చించినట్లు టాక్‌. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్ది రోజుల వరకు వేచి చూడాల్సిందే.

చదవండి :
ఓటీటీలోకి ఉప్పెన.. రూ.7 కోట్లకు కొనుగోలు

రేటు పెంచేసిన మాస్‌ మహారాజా.. నిర్మాతలకు షాకే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement