మనిషి ఒక్కడే.. మొహాలు రెండు! | NKR films acquired Vikram Iru Mugan Telugu version Inkokkadu rights | Sakshi
Sakshi News home page

మనిషి ఒక్కడే.. మొహాలు రెండు!

Published Thu, Jul 28 2016 11:18 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

మనిషి ఒక్కడే.. మొహాలు రెండు!

మనిషి ఒక్కడే.. మొహాలు రెండు!

 ‘ఇరుముగన్’... అంటే రెండు మొహాలు ఉన్నవాడు అని అర్థం. విక్రమ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం టైటిల్ ఇది. సినిమా సినిమాకీ విభిన్నమైన పాత్రల్లో కనిపించి, తనలో విలక్షణ నటుడు ఉన్న విషయాన్ని విక్రమ్ నిరూపించుకున్నారు. గతేడాది విడుదలైన ‘ఐ’లో ఎవరూ ఊహించని విచిత్రమైన గెటప్‌లో కనిపించి, ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు ‘ఇరుముగన్’లో విలక్షణమైన పాత్రలో కనిపించనున్నారాయన.
 
 విక్రమ్, నయనతార, నిత్యామీనన్ ముఖ్య తారలుగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో శిబు థమీన్స్ నిర్మించిన ఈ చిత్రం తెలుగులో విడుదల కానుంది. ఎన్‌కేఆర్ ఫిలింస్ పతాకంపై ‘ఇంకొక్కడు’ పేరుతో నీలం కృష్ణారెడ్డి  తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ- ‘‘యాక్షన్, థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ రాలేదు.
 
 హై టెక్నికల్ వేల్యూస్, విజువల్ ఎఫెక్ట్స్‌తో భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం ఇది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన టీజర్‌తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. విక్రమ్ నటన, నయనతార, నిత్యామీనన్ అందచందాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఆగస్టు 2న చెన్నైలో తమిళ వెర్షన్ పాటలు విడుదలవుతున్నాయి. తెలుగులో త్వరలో పాటలు, సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: హారీస్ జైరాజ్, కెమేరా: ఆర్. రాజశేఖర్.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement