8న తెరపైకి ఇరుమురుగన్ | Iru Mugan censored, film to release on September 8 | Sakshi
Sakshi News home page

8న తెరపైకి ఇరుమురుగన్

Published Wed, Aug 31 2016 1:38 AM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM

8న తెరపైకి ఇరుమురుగన్

8న తెరపైకి ఇరుమురుగన్

ఇరుమురుగన్.. ప్రస్తుతం భారీ అంచనాలను సంతరించుకున్న చిత్రం ఇదేనని చెప్పవచ్చు. కారణం వైవిధ్యం కోసం తపించే నటుడు సియాన్ విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం ఇరుముగన్. ఈయన పలు చిత్రాల్లో పలు గెటప్‌లలో కనిపించి అలరించినా తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ఇదే అవుతుంది. ఐ చిత్రం అందరిని ఆశ్చర్య పరచినా, ఆ తరువాత నటి0చిన 10 ఎండ్రదుకుళ్ చిత్రం విక్రమ్‌ను నిరాశపరచిందనే చెప్పాలి.
 
 దీంతో చాలా కసిగా చేసిన చిత్రం ఇరుముగన్. ఇక లేడీ సూపర్‌స్టార్ నయనతారతో కలిసి నటించిన మొదటి చిత్రం ఇదే. ఇందులో మరో నాయకిగా నిత్యామీనన్ నటించారు. నాజర్, తంబిరామయ్య, బాలా, మనో, ప్రతాప్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అరిమనంబి చిత్రం ఫేమ్ ఆనంద్‌శంకర్ దర్శకుడు. కాగా ఇంతకు ముందు విజయ్ హీరోగా రూపొందిన పులి చిత్ర నిర్మాతల్లో ఒకరైన శిబు తమీన్స్ నిర్మించిన భారీ చిత్రం ఇరుముగన్.
 
  హారీష్ జయరాజ్ సంగీతాన్ని, ఆర్‌డీ.రాజశేఖర్ చాయాగ్రహణం అందించిన ఈ చిత్రంలో మరో ప్రత్కేక అంశం నటుడు విక్రమ్ హిజ్రా తరహా పాత్రలో విలనీయం ప్రదకర్శించడం. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సోమవారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఇరుముగన్ చిత్రానికి యూఏ సర్టిఫికెట్‌ను ఇచ్చారు. దీంతో చిత్రానిన్ని సెప్టెంబర్ 8వ తేదీన విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement