షాక్ ఇస్తున్న విక్రమ్ లుక్స్ | Vikram surprises fans with his new look | Sakshi

షాక్ ఇస్తున్న విక్రమ్ లుక్స్

Aug 2 2016 2:41 PM | Updated on Sep 4 2017 7:30 AM

షాక్ ఇస్తున్న విక్రమ్ లుక్స్

షాక్ ఇస్తున్న విక్రమ్ లుక్స్

ప్రయోగాత్మక చిత్రాలతో కూడా భారీ కమర్షియల్ సక్సెస్ లు సాధించొచ్చని నిరూపించిన సౌత్ హీరో విక్రమ్. శివపుత్రుడు, అపరిచితుడు లాంటి సినిమాలతో ఆకట్టుకున్న విక్రమ్ ఐ సినిమాతో కమర్షియల్ గా...

ప్రయోగాత్మక చిత్రాలతో కూడా భారీ కమర్షియల్ సక్సెస్ లు సాధించొచ్చని నిరూపించిన సౌత్ హీరో విక్రమ్. శివపుత్రుడు, అపరిచితుడు లాంటి సినిమాలతో ఆకట్టుకున్న విక్రమ్ ఐ సినిమాతో కమర్షియల్ గా నిరాశపరిచినా.. నటుడిగా మాత్రం తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. అయితే ఐ తరువాత మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న చియాన్.. ప్రయోగాలను మాత్రం పక్కన పెట్టడం లేదు.

తాజాగా విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఇరుముగన్. ఈ సినిమా కోసం మరోసారి తన క్యారెక్టర్ విషయంలో భారీ ప్రయోగాలు చేస్తున్నాడు విక్రమ్. ఈ సినిమాలో విలన్ గా, హీరోగా ద్విపాత్రాభినయం చేస్తున్న విక్రమ్, విలన్ పాత్ర కోసం సాహసం చేస్తున్నాడు.

డ్రగ్స్ తయారు చేసే హిజ్రా సైంటిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు విక్రమ్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేస్తోంది. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నిత్యామీనన్, నయనతారలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈసినిమాను తెలుగులో ఇంకొకడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement