రూ.100 కోట్ల దిశగా మరో సినిమా | Vikram's Iru Mugan inching towards Rs 100 crore mark | Sakshi
Sakshi News home page

రూ.100 కోట్ల దిశగా మరో సినిమా

Published Tue, Sep 20 2016 3:08 PM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM

రూ.100 కోట్ల దిశగా మరో సినిమా

రూ.100 కోట్ల దిశగా మరో సినిమా

చియాన్ విక్రమ్ తాజా చిత్రం ‘ఇరుమురుగన్’ రూ. వంద కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద రూ. 90 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమా భారీ కలెక్షన్లు కొల్లగొట్టడం విశేషం. ఆదివారం నాటికి ఈ సినిమా రూ.90.07 కోట్ల కలెక్షన్లు సాధించిందని సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్ రమేశ్ బాల వెల్లడించారు. వంద కోట్ల క్లబ్ లో ఈ చిత్రం చేరే అవకాశాలున్నాయని ఆయన అంచనా వేశారు. విక్రమ్ సినిమాల్లో అత్యధిక ఆరంభ వసూళ్లు సాధించిన రెండో చిత్రం ‘ఇరుమురుగన్’  అని నిర్మాత శిబు తమీన్స్ తెలిపారు. గతేడాది శంకర్, విక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఐ’ సినిమా అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టింది.

సై-ఫై థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘ఇరుమురుగన్’ లో విక్రమ్ డ్యుయల్ రోల్ లో నటించాడు. రా ఏజెంట్, హిజ్రా సెంటిస్ట్ గా డిఫరెంట్ గా కనిపించాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్ సరసన నయనతార, నిత్యామీనన్ నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement