సెంటిమెంట్ను నమ్ముకున్న విక్రమ్
సెంటిమెంట్ను నమ్ముకున్న విక్రమ్
Published Tue, Aug 9 2016 10:12 AM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM
చాలా రోజులుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న విలక్షణ నటుడు విక్రమ్ మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇరుముగన్ సినిమాలో హీరోగా విలన్గా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. తన క్యారెక్టర్ లుక్ విషయంలో ఎన్నో ప్రయోగాలు చేసే ఈ స్టార్ హీరో ఈ సారి విలన్ పాత్ర కోసం హిజ్రాగా నటిస్తున్నాడు.
ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ సాధించాలని భావిస్తున్న విక్రమ్, ఓ సెంటిమెంట్ మీద నమ్మకం పెట్టుకున్నాడు. తమిళ నాట.. హీరోగా విలన్గా ఒకే నటుడు నటించిన సినిమాలన్ని ఘనవిజయం సాధించాయి. అజిత్ నటించిన వాలి, రజనీ లీడ్ రోల్స్లో తెరకెక్కిన రోబో, కమల్ హాసన్ దశావతారం లేటెస్ట్గా సూర్య 24 సినిమాలు ఈ సెంటిమెంట్కు మరింత బలం చేకూర్చాయి. ఇప్పుడు ఇదే జానర్లో వస్తున్న ఇరుముగన్ కూడా సక్సెస్ సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు విక్రమ్.
Advertisement
Advertisement